చిరంజీవి మేనకోడలుతో శ్రీకాంత్ తనయుడు

Srikanth's Son Roshan in Niramala Convent

02:01 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Srikanth's Son Roshan in Niramala Convent

జై చిరంజీవ సినిమా లో చిరంజీవి మేనకోడలు గా నటించిన అమ్మాయి శ్రీకాంత్ తనయుడు హీరో గా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అవును నిజమే శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సినిమా 'నిర్మల కాన్వెంట్‌'. జై చిరంజీవ, దూకుడు, రోబో సినిమా లలో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ, రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. నాగార్జున సమర్పణలో జి. నాగకోటేశ్వరరావుని దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌-మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. మెదక్‌, అరకు, నైనిటాల్‌ జైపూర్‌ తదితర ప్రాంతాలలో 5 షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇంకా నాగ్‌ పై చిత్రీకరించవలసిన సన్నివేశాలు మాత్రమే మిగిలున్నాయి. ఈ సినిమా మంచి యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది అని చిత్ర యూనిట్‌ తెలుపుతుంది.

English summary

Srikanth's Son is acting Roshan is acting in a debut movie Niramala Convent. Shrey Sharma is romancing with Roshan in this movie. Nagarjuna is playing guest role in this movie.