తిరుమల శ్రీవారికి వేలకోట్లు కుమ్మరించిన ఒకేఒక్కడు... ఎవరో తెలుసా?

Srikrishna Devaraya donated thousand crores of ornaments to Lord Venkateswara

11:49 AM ON 26th July, 2016 By Mirchi Vilas

Srikrishna Devaraya donated thousand crores of ornaments to Lord Venkateswara

తిరుమల తిరుపతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ వెంకటేశ్వరస్వామి... ఎన్నిసార్లు చూసిన తనివితీరని రూపం... అందుకే నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. ఇక తిరుమల గిరుల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తిరుమలలోని ప్రతి ప్రాంతం ఎంతో ప్రాశస్త్యం కలిగింది. అంతేకాదు శ్రీవారి ఆలయం మొదట్లో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ప్రస్తుతం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేక అలంకరణలు, ఫలపుష్పాల ప్రదర్శనలు తప్ప శ్రీవారి ఆలయంలోని ప్రతి వస్తువు ఇప్పటికీ అలాగే ఉంది.

పెద్ద పెద్ద రాతి స్తంభాలతో పాటు ప్రముఖుల విగ్రహాలు సైతం అలాగే ఉన్నాయి. అందులో ప్రధానమైన ప్రతిమా మండపం అని చెప్పాలి. ఇందులో అతి ముఖ్యమైన విగ్రహం శ్రీకృష్ణదేవరాయలు వారిదే. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, తెలుగువారి గొప్పతనాన్ని నలుదిశలా చాటిన ప్రభువులు. అదంతా పక్కన పెడితే..

1/6 Pages

కృష్ణరాయ మండపం:

మహాద్వారానికి ఆనుకొని లోపల ఉన్న 16 స్తంభాలతో 27-25 కొలతల గల ఎతైన మండపం నిర్మించి ఉంటుంది. ఈ మండపాన్ని కృష్ణరాయమండపమని, ప్రతిమా మండపమని అంటారు. ఈ మండపం విజయనగర శిల్ప సాంప్రదాయ రీతిలో మలిచారు. దీన్ని ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించినట్లు చెబుతారు. అందుకే ఇప్పటికీ ఈ మండపం కనీసం చెక్కుచెదరలేదు. ఈ మండపంలో కుడివైపున రాతి విగ్రహాలు ఉన్నాయి. సాహితీ సమరాంగణ సార్వభౌముడు!

విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల వారి విగ్రహంతో పాటు ఆయన దేవేరులైన తిరుమలదేవి, చిన్నాదేవులు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఈ విగ్రహాలు మొత్తం శ్రీ వేంకటేశ్వరునికి ఎదురుగా నిల్చొని, ప్రాంజలి ఘటిస్తున్న భక్త వేషంలో ప్రతిష్టితులై ఉంటాయి. క్రీస్తుశకం 1517వ సంవత్సరంలో జనవరి 2వ తేదీన శ్రీ కృష్ణదేవరాయల వారే స్వయంగా తమ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించుకున్నారని అంటారు. ఈ విగ్రహాల భుజసీమల్లో వారి నామధేయాలు లిఖింపబడి ఉన్నాయి. ఆ నాటి నుంచి ఇది కృష్ణరాయమండపమని ప్రాశస్త్యం పొందింది.

English summary

Srikrishna Devaraya donated thousand crores of ornaments to Lord Venkateswara