కీవీస్‌తో టెస్టులో శ్రీలంకకు ఆధిక్యం

Srilanka Leads In Test With Newzeland

06:46 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Srilanka Leads In Test With Newzeland

హామిల్టన్‌లో న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో శ్రీలంకకు స్వల్ప ఆధిక్యం లభించింది. 264/7 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన శ్రీలంక 292 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కివీస్ ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. కివీస్ ఆటగాళ్లలో గప్తిల్(50) మరోసారి ఆకట్టుకోగా, సాంత్నార్(38) ఫర్వాలేదనిపించాడు. బ్రేస్ వెల్(30 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో దుష్మంతా చమీరా ఐదు వికెట్లతో రాణించి కివీస్ ను కట్టడి చేశారు. దీంతో శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్ లో 60 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి టెస్టులో కివీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

English summary

Srilanka is in lead in the test test match playing with Newzeland . At the end of the day Newzeland was with 232 runs for 9 wickets