శ్రీమంతుడు శతదినోత్సవ వేడుకలు

Srimanthudu Celebrating 100 days in 15 Centers

05:23 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Srimanthudu Celebrating 100 days in 15 Centers

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం నేటీతో 15 సెంటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఆగష్టు 7 న విడుదలైంది. మనం పుట్టిన ఊరికి తిరిగి ఏమైనా ఇవ్వాలనే మంచి సందేశంల, చక్కని కథాంశంతో రచయిత, దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తీశారు.

శ్రీమంతులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని తీర్చిదిద్దే కధాంశంలో వచ్చింది. ప్రేక్షకులకి ఈ కధ బాగా కనెక్టయింది. సినిమా విడుదలయ్యాక ముందు ఏవరేజ్‌ టాక్‌ వచ్చినా ఆ తరువాత ప్రేక్షకులకి ఈ చిత్రం బాగా నచ్చింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా 80 కోట్లు షేర్‌ని సొంతం చేసుకుని బాహుబలి సినిమాకి తరువాత స్థానంలో నిలిచింది.

నవంబర్‌ 14 ఈ రోజుతో 15 సెంటర్స్‌లో వంద రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవ వేడుక జరుపుకుంటోంది. ఇందులో శృతిహాసన్‌ నటన, అందం కూడా సినిమా విజయానికి ప్లస్‌ అయింది.

English summary

Srimanthudu Celebrating 100 days in 15 Centers, super star mahesh babu's srimanthudu movie is celebrating 100 days on saturday, november 14.