సిల్వర్ జూబ్లీకి చేరిన 'శ్రీమంతుడు'

Srimanthudu Completes 175 Days

09:45 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Srimanthudu Completes 175 Days

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా వచ్చిన విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడమే కాకుండా 100 కోట్ల షేర్‌ సాధించి మహేష్‌ చిత్రాల్లో రికార్డ్‌ సృష్టించింద ని అంటున్నారు.15 సెంటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 28న సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'శ్రీమంతుడు' చిత్రం ఇప్పటికే 6 'ఐఫా' అవార్డులు గెలుచుకుని ఫుల్ జోష్ మీదుంది. ఉత్తమ నటుడుగా సూపర్‌స్టార్‌ మహేష్‌, ఉత్తమనటిగా శృతిహాసన్‌, ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌, ఉత్తమ గేయరచయితగా రామజోగయ్యశాస్త్రి(రామ.. రామ), ఉత్తమ నేపథ్యగాయకుడిగా సాగర్‌(జతకలిసే..) 'ఐఫా' అవార్డులు అందుకున్నారు.

ఇప్పుడు ఎమ్మిగనూరు - లక్ష్మణ్‌ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు పూర్తి చేసుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) ఉత్సాహంగా స్పందిస్తూ, ''మా బేనర్‌లో నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం ఈరోజుతో 175 రోజులు పూర్తి చేసుకుంటోంది. మా మొదటి ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం ఇంత భారీ విజయాన్ని సాధించడం నిజంగా ఆనందంగా వుంది. మా తొలిసినిమాని సూపర్‌స్టార్‌ మహేష్‌తో నిర్మించడం, పైగా సిల్వర్‌ జూబ్లీ చిత్రం కావడం మాకు చెప్పలేని ఆనందం కలిగిస్తోంది. డైరెక్టర్‌ కొరటాల శివ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా మలిచి, మా బేనర్‌కు ఘన విజయాన్ని చేకూర్చారు. అంతేకాదు, ఈ చిత్రానికి 6 'ఐఫా' అవార్డులు రావడం చాలా హ్యాపీగా వుంది'' అని వివరించారు. మొత్తానికి శ్రీమంతుడు యూనిట్ మొత్తం ఖుషీలో వున్నారు.

English summary

Mahesh Babu's Srimanthudu movie which was directed by Koratala Shiva was Completed 175 days today.The producer of this film was said that the movie unit was very happy with the success of the movie and the awards this movie got in IIFA Utsavam