'శ్రీమంతుడు' టీమ్‌ ఆర్ధిక సహాయం

Srimanthudu Team Donates 10 Lakhs to Heal A Child Foundation

03:33 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Srimanthudu Team Donates 10 Lakhs to Heal A Child Foundation

కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్‌ మహేష్‌ నటించిన శ్రీమంతుడు ఇటీవలే 100 రోజుల పండుగ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌ను కాంటెస్ట్‌లో గెలిచిన విజేతకు బహూకరించారు. ఇది మరువక ముందే శ్రీమంతుడు టీమ్‌ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రంలో శ్రీమంతులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని ఆధునికంగా మార్చాలన్న సందేశంతో తెరకెక్కింది. ఆ సందేశాన్ని గుర్తుచేస్తూ శ్రీమంతుడు టీమ్‌ మరో అడుగు ముందుకేసింది.

సామాజిక సేవలతో రూపొందించిన 'హీల్‌ ఏ చైల్డ్‌' అనే సంస్థకు 10 లక్షల రూపాయలను విరాళాన్ని అందజేసింది. ఈ టీమ్‌ 'హీల్‌ ఏ చైల్డ్‌' సంస్థకు చెక్‌ను అందజేసింది. ఈ కార్యక్రమంలో మహేష్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌, దర్శకుడు కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు పాల్గొన్నారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ మా చిత్రంలో ఇచ్చిన సందేశం దేశమంతా కొనసాగడానికి ఈ ఆలోచన చేశామని చెప్పారు. ఇదే కాకుండా బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి కూడా 5 లక్షల రూపాయల చెక్‌ను శ్రీమంతుడు టీమ్‌ అందజేసింది.

English summary

Srimanthudu Team Donates 10 Lakhs to Heal A Child Foundation