బాహుబలిని కొట్టిన శ్రీమంతుడు 

Srimantudu Beats Bahubali

02:42 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Srimantudu Beats Bahubali

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 24,25తేదీల్లో రెండు రోజులపాటు జరిగిన ఐఫా ఉత్సవంలో దక్షిణాది తారలు సందడి చేసారు. ఆయా భాషా చిత్రాలకు అవార్డులు అందించారు. తెలుగు భాషకు సంబంధించి ఇచ్చిన పురస్కారాల్లో, తెలుగు చలన చిత్రసీమకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన బాహుబలి చిత్రానికి పురస్కారాల్లో చోటు లభించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రం కూడా అవార్డులు గెలుచుకుంది. అయితే బాహుబలికి నాలుగు పురస్కారాలు లభిస్తే , శ్రీమంతుడు 5పురస్కారాలు దక్కించుకుంది. కలెక్షన్లలో పోటీ పడిన శ్రీమంతుడు ఐఫా పురస్కారాల్లో బాహుబలిని కొట్టేసింది.

శ్రీమంతుడు చిత్రానికి ఉత్తమ నటుడు – మహేష్ బాబు , ఉత్తమ నటి – శృతి హాసన్, ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ సహాయ నటుడు – జగపతి బాబు, ఉత్తమ గీత రచయిత – రామజోగయ్య శాస్త్రి , ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సాగర్ అవార్డులు అందుకున్నారు.

ఇక బాహుబలి విషయానికొస్తే, ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ చిత్రం – (శోభుయార్లగడ్డ – ప్రసాద్ దేవినేని), ఉత్తమ సహాయ నటి – రమ్యకృష్ణ, ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ – సత్య యామిని అవార్డులు పొందారు. అంటే శ్రీమంతుడుకి 6 పురస్కారాలు లభిస్తే, బాహుబలికి 4 మాత్రమే వచ్చాయి.

ఇక్కడవరకు శ్రీమంతుడే టాప్ పొజిషన్. అయితే మిగిలిన భాషల్లో కూడా రావడం 'బాహుబలి' అల్టిమేట్ గా కల్సివచ్చేసింది. ఆలెక్కన చూస్తే, బాహుబాలే టాప్ గా నిలిచింది. ఐఫా ఉత్సవంలో తొలిరోజు తమిళ వెర్షన్ లో ఏడు పురస్కారాలు లభించాయి. ఉత్తమ ప్రతిభకు అందించిన పురస్కారాల్లో బాహుబలి తమిళ వెర్షన్ కి ఏకంగా 7 పురస్కారాలు లభించాయి..ఉత్తమ చిత్రంతో కలిపి మొత్తం ఏడు పురస్కారాలు సొంతంచేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు , ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ నటి ఉత్తమ నేపథ్య గాయని ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. దీంతో ఇటు తెలుగులో నాలుగు వచ్చినా, తమిళ వెర్షన్ లో ఏకంగా 7 పురస్కారాలు రావడంతో బాహుబలికి పురస్కార పంట పండింది. అదండీ సంగతీ.....

English summary

Te Movie which came in the combination of Mahesh Babu and Koratala Siva was won more awards than Bahubali movie in IIFA Awards.Mahesh Babu's Srimanthudu Movie Got 6 awards while S.S.Rajamouli's picture Bahubali Won 4 Awards in IIFA Awards