యాంకర్ శ్రీముఖి భుజాలకేమైందో తెలుసా?

Srimukhi shoulders was injured with tight dress

04:11 PM ON 21st July, 2016 By Mirchi Vilas

Srimukhi shoulders was injured with tight dress

అనసూయ, రష్మీ వంటి హాట్ యాంకర్లు తమ అందాల ఆరబోతతో యాంకర్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలుతుంటే.. నేను కూడా అందాలు ఆరబొయ్యగలనని వాళ్ళని తలదన్నేలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది యాంకర్ శ్రీముఖి. తన యాంకరింగ్, అందాల విందుతో ఇటీవల ప్రేక్షకుల మదిని బాగానే దోచుకుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య ఓ ఈవెంట్ కి వచ్చిన శ్రీముఖి.. బ్లూకలర్ చీర కట్టుకుని.. స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని చక్కగా హాట్ హాట్ గా ముస్తాబై వచ్చింది. అయితే.. దానిపై భుజాలను కవర్ చేస్తూ ఓ కోటు లాంటి కాస్ట్యూమ్ ని వేసుకు రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

ఇదేంటి చక్కని చీర జాకెట్ వేసుకుని పైన కోట్ ధరించింది ఏమిటా అని చాలా మందిలో అనుమానం కలిగింది. నిజానికి ఆ కోటు శ్రీముఖి లుక్స్ ని బాగా చెడగొట్టేసింది. అయితే ఆ కోటు ఎందుకు వేసుకుందో శ్రీముఖికి బాగా తెలుసు. ఇప్పుడు ఆ కోటు ఎందుకు వేసుకుందో అన్న విషయాన్ని శ్రీముఖి స్వయంగా వివరించింది. ఇటీవల ఓ ప్రోగ్రాంకి టైట్ ఔట్ ఫిట్స్ వేసుకుని యాంకరింగ్ చేసింది ఈ అమ్మడు. పైకి చాలా అందంగా కనిపిస్తున్నా.. అంత టైట్ డ్రస్ ఈమె స్కిన్ ని పాడు చేసేసింది. గోల్డ్ ఎంబ్రాయిడరీతో చూడముచ్చటగా ఉన్న ఆ డ్రస్ కారణంగా.. శ్రీముఖి భుజాలపై మచ్చలు పడిపోయాయి.

ఏకంగా ఆ డిజైన్ తరహాలోనే ఆమె భుజాలు కందిపోవడం బాధాకరమే. అందంగా ఉన్నా అన్ని రకాల డ్రస్ లు అందరికీ సూట్ కావనే విషయాన్ని ఈ సంఘటనతో అర్ధం చేసుకోవచ్చు. డ్రస్సుల్లో ఖచ్చితమైన సైజు మరియు స్కిన్ తత్వానికి సరిపడే మెటీరియల్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. తన భుజాలను కవర్ చేసుకుంటూ కోటు లాంటిది ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో కారణం చెప్పాక.. శ్రీముఖి గురించి అందరూ అయ్యో అనుకుంటున్నారు.

English summary

Srimukhi shoulders was injured with tight dress