కృష్ణలో మునిగిన సంగమేశ్వరుడు

Srisailam Dam Set To Receive Huge Amount Of Water

11:19 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Srisailam Dam Set To Receive Huge Amount Of Water

ఇదేమిటి ఇంకా కృష్ణా పుష్కరాలు రాలేదు కదా. అప్పుడే సంగమేశ్వరుడు కృష్ణాలో మునకేయడం ఏమిటని అంటుకుంటున్నారా? పుష్కర స్నానం కాదు. శ్రీశైలం రిజర్వాయర్కు వరద కొనసాగుతోన్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు 10 గేట్ల నుంచి నీటి విడుదలతో భారీగా ప్రవాహం వస్తుండగా శ్రీశైలం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సంగమేశ్వరం వద్ద లోయర్ పుష్కరఘాట్ బ్యాక్ వాటర్లో పూర్తిగా మునిగింది. ఇక తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ప్రవాహం స్వల్పంగా ఉన్నా దానికి రెట్టింపుగా కాల్వలకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో సంగమేశ్వర ఆలయం నీటిలో మునిగింది. అంటే కర్నూలు జిల్లాలో సప్తనదీ సంగమక్షేత్రం 19 నెలల తర్వాత మళ్లీ కృష్ణవేణి గర్భంలోకి చేరుకుంటోంది. మరోవైపు కర్ణాటకలోని ఆలమట్టివద్ద 26 గేట్లు, నారాయఱపూర్ ప్రాజెక్టువద్ద 24 గేట్లు ఎత్తివేయడంతోపాటు విద్యుదుత్పాదనవల్ల భారీగా నీరు విడుదలవుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టువైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో పది గేట్లను పైకెత్తడంతోపాటు విద్యుదుత్పాదనద్వారా మరికొంత నీటిని విడుదల చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: తారలు..వారి భార్యలు

ఇది కూడా చూడండి: మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

English summary

Srisailam Dam Set To Receive Huge Amount Of Water.