శృతిని టీజ్‌ చేస్తున్న నాగచైతన్య!!

Sruthi Haasan acting as a lecturer in Nagachaitanya's Majnu movie

11:24 AM ON 4th December, 2015 By Mirchi Vilas

Sruthi Haasan acting as a lecturer in Nagachaitanya's Majnu movie

నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'మజ్ను' చిత్రం ఘాటింగ్‌ ప్రస్తుతం వైజాగ్‌ ఆంధ్రా యూనివర్సిటీ కేంపస్‌లో జరుగుతుంది. ఈ చిత్రానికి 'కార్తికేయ' ఫేమ్‌ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శృతిహాసన్‌ కూడా ఒక కధానాయిక. అయితే శృతిహాసన్‌ ఇందులో ఒక లెక్చరర్‌గా కనిపించబోతోంది. ఒక లవ్‌ ఫెయిల్యూర్‌ తర్వాత నాగచైతన్య చదివే కాలేజ్‌కి లెక్చరర్‌గా వచ్చే రోల్లో శృతి నటిస్తుంది. అయితే నాగచైతన్య కి లెక్చరర్‌గా కనిపించాలంటే చైతూ కంటే కొంచెం ఏజ్‌ ఎక్కువ ఉన్న అమ్మాయిగా శృతి ఉండాలి. అందుకోసం శృతి తన లుక్‌నే మార్చేసుకుంది.

ఎప్పుడు కురచ దుస్తుల్లో హాట్‌హాట్‌గా కనిపించే శృతి ఈ చిత్రంలో నిండుగా చీర కట్టుకుని కనిపించబోతుంది. ఈ లెక్చరర్‌ క్యారెక్టర్‌లో గంభీరంగా కనిపించేందుకు మంగళగిరి కాటన్‌ చీరలు ధరించడంతో పాటు మేకప్‌ లేకుండా కూడా నటిస్తోంది. ఒక పక్క నాగ చైతన్య కూడా కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో చైతూ మూడు ఏజ్‌ గ్రూపులలో కనిపించనున్నాడు. అందుకోసం మూడు క్యారెక్టర్లలో వేరియేషన్‌ కనిపించేందుకు తన బాడీ లాంగ్వేజ్‌ని కూడా మార్చుకున్నాడు. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కూడా నటిస్తోంది.

English summary

Sruthi Haasan acting as a lecturer in Nagachaitanya's Majnu movie. This movie is directing by 'Karthikeya' fame Chandu Mondeti.