మళ్ళీ రామ్‌చరణ్‌తో శృతిహాసన్‌

Sruthi Haasan in Ramcharan's Next Movie

04:20 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Sruthi Haasan in Ramcharan's Next Movie

ఎవడు చిత్రంలో రామ్‌చరణ్‌తో జతకట్టిన శృతిహాసన్‌ మళ్ళీ 'తని ఒరువన్‌' చిత్రంతో జతకట్టబోతుందని తాజా సమాచారం. రామ్‌చరణ్‌ బ్రూస్‌లీ ఫ్లాప్‌తో తమిళంలో సూపర్‌హిట్‌ అయిన 'తని ఒరువన్‌' తన తదుపరి చిత్రం రీమేక్‌ చెయ్యడానికి ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో శ్రీమంతుడు, తమిళంలో వేదాళం చిత్రాలు సూపర్‌ హిట్‌ అవ్వడంతో మంచి ఊపుమీదున్న శృతిహాసన్‌ ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన నటించడానికి ఉవ్విళ్ళూరుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. హీరోయిన్‌గా శృతిహాసన్‌ దాదాపుగా ఖరారైనట్లే. మిగతా నటీనటులను ఎంచుకోవాల్సి ఉంది. అమెరికా టూర్‌ నుండి రామ్‌చరణ్‌ తిరిగి వచ్చాక డిసెంబర్‌ మొదటి వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.

English summary

Sruthi Haasan in Ramcharan's Next Movie