దమ్ముంటే ముందుకు రమ్మన్న శృతి

Sruthi Hassan About Gossips

10:31 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Sruthi Hassan About Gossips

ఇదేమైనా ఫ్యాక్షన్ బాక్ డ్రాప్ సినిమాలో డైలాగులా వుందే. అలానే వుంది కానీ అది కాదు. మరి శ్రుతి ఎందుకు అంత బరువైన పదం వాడేసింది. అంతకోపానికి కారణం ఏమిటి? ప్రస్తుతం ‘ప్రేమమ్‌’ తెలుగు రీమేక్‌తోపాటు తమిళంలో రెండు సినిమాలతో బిజీగా గడుపు తున్న శ్రుతి ఇంత లా మాట్లాడడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే , విషయంలోకి వెళ్ళాల్సిందే. ప్రతి రోజు ఉదయం పేపర్‌ చూడడానికి ముందు తన గురించి గాసిప్స్‌ ఉండకూడదని కోరుకునే శ్రుతి హాసన్ ఒకవేళ అలాంటివి ఉంటే చూసి నవ్వేసుకుని ఊరుకుంటుంది అట. తన గురించి ఎలాంటి గాసిప్స్ లేకపోతే సంతోషంగా తర్వాతి పనిలోకి వెళ్లిపోతుందట. ఇక ఇతరుల పై వచ్చే గాసిప్స్‌ గురించి అస్సలు పట్టించుకోదట. కనీసం ఆ వార్త చదవడానికి కూడా ఇష్టపడదట. అంతవరకూ బానే వుంది. మరి కోపం ఎందుకు వచ్చానట్టు అంటే,

గాసిప్స్‌తోపాటు నాకు నవ్వు తెచ్చే ఇంకో విషయం ఉందని శ్రుతి చెబుతోంది. అదే ట్విట్టర్‌. ఎవరో ముక్కు, మొహం తెలియనివారు కంప్యూటర్‌ ముందు కూర్చొని ట్విట్టర్‌లో ఇష్టమొచ్చిన రాతలు రాస్తుంటారట. వాటిని చదివి చాలా నవ్వుకుంటా నంటోంది. అయితే ఇలా ఇష్టమొచ్చినట్లు రాతలు రాసేవారు దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడ మనండి' అంటోంది. అలాంటి వారిని ఓసారి కలవాలనిపిస్తుంటుంది’’ అని శ్రుతి ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.

English summary

Heroine Sruthi Hassan Says that she will laugh when rumors come on her.She says that when the rumors did not came at her she will go happily to shooting next day.