దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను

Sruthi Hassan About Increasing Remeneration

12:01 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Sruthi Hassan About Increasing Remeneration

క్రేజ్ ఉన్నప్పుడే ఏదో లాగా సొమ్ము చేసుకోవాలని బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, ఏ భాషా ముద్దు గుమ్మాలు చేసే పనే. ఇలా కాసిన్ని సినిమాల విజయం అందుకోగానే, అలా అమాంతం పారితోషికాలు పెంచేసే బాపతు ఎక్కువ. అయితే దీనికి పూర్తి భిన్నంగా ఆలోచిస్తానంటోంది శ్రుతి హాసన్‌..... ‘‘ఎప్పుడూ డబ్బు యావ నా తత్వానికి విరుద్ధం’’ అని శృతి చెప్పే మాట. ఒకటి మాత్రం మా లాంటి హీరోయిన్స్ వృత్తిగత జీవితం పరిమితం. ఉన్న కొంత సమయంలోనే మేమేమిటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. దాంతో సవాళ్లు మాకే ఎక్కువ. వాటిని అధిగమించి, క్రేజ్‌ సంపాదించడమంటే సామాన్య విషయం కానే కాదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కావాలన్న నానుడికి అనుగుణంగా డిమాండ్‌ని కథానాయికలు సొమ్ము చేసుకోవడంలో తప్పేం లేదు. అయితే నా దృష్టి మాత్రం క్రేజ్‌ ఉండగానే డబ్బు చేసుకోవడంపై కాకుండా , మరిన్ని అవకాశాలు పొందే విధంగా చేసుకోవడం మీదే దృష్టి సారిస్తా. తద్వారా వాటిని సద్వినియోగం చేసుకోవడం ఇంకా ముఖ్యం' అంటూ లెక్చర్ ఇస్తోంది. హీరోయిన్ గా నాకు డిమాండ్‌ ఉందంటే ఎక్కువ అవకాశాలతో నా దగ్గరకి వెతుక్కుంటూ వస్తారు. అలాంటప్పుడు రకరకాల కథలూ దరిచేరతాయి. అప్పుడు నటిగా నిరూపించుకొనే అవకాశం నాకు పుష్కలంగా ఉంటుందిగా. అందుకే అలా ఆలోచిస్తాను. అందుకే పారితోషికానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను' అని చెప్పే శ్రుతి. ప్రస్తుతం నాగచైతన్యతో కలసి ‘మజ్ను’లో నటిస్తున్న సంగతి తెల్సిందే.

English summary

South Top Heroine Sruthi Hassan Says that she was not the type of heroine who increases remuneration when she has craze in the industry.she says that she will think like if there was craze then she gets more oppurtunities