అసలు ఆ ఆలోచనే లేదు

Sruthi Hassan Press Note Against Media

09:53 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Sruthi Hassan Press Note Against Media

తారల కబుర్లు చెప్పినా చెప్పకున్నా ఈ మధ్య ఏది పడితే అది రాసేస్తున్నారు. దీంతో అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రుతిహాసన్‌ తమిళ నటుడు శింబు సరసన ప్రత్యేక గీతంలో నటిస్తున్నట్లు వచ్చిన వార్త లోచ్చాయి. అయితే వీటిని శృతి కొట్టిపడేసింది.

శింబు, నయనతార జంటగా తెరకెక్కుతున్న ‘ఇదు నమ్మ ఆలు’ అనే తమిళ చిత్రంలో స్పెషల్ సాంగ్ డాన్స్ చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండిస్తూ, మీడియాకు ఏకంగా ఓ ప్రెస్‌నోట్‌ జారీచేసింది. ఇలాంటి వార్తలు రాసే ముందు ఎందుకు ధ్రువీకరించుకోరు అంటూ అందులో ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఈ విషయానికి సంబంధించి తనని ఎవరూ సంప్రదించలేదని, ఎవరైనా సంప్రదించినా.. తనకు స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేసే ఆలోచన లేదని శ్రుతి తెగేసి చెప్పేస్తోంది. అయినా ఇంకా ఆఫర్లు వస్తుంటే స్పెషల్ సాంగ్స్ తో సరిపెట్టుకోవాల్సిన అవసరం శ్రుతికి ఏముందని ఆమె అభిమానులు అంటున్నారు.

English summary

South Indian Top Actress Sruthi Hassan released a press not against media.Sruthi hassan says that a rumor on her that she was going to do an special song in Simbh-Nayanatara upcoming film "Idu Namma Alu " movie.Sruthi says that all was wrong and media was spreading wrong information about her