కాకమ్మ కధలు బాగా వచ్చట....

Sruthi Hassan To Write Film Story

10:36 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Sruthi Hassan To Write Film Story

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో హల్‌చల్‌ చేస్తోన్న నటి శ్రుతి. నటుడు కమల్ హాసన్ కూతురైన ఈ ముద్దుగుమ్మలో మంచి నటి దాగి ఉందన్న విషయం ఆమె తెరపైకి వచ్చిన కొత్తలోనే తెలిసిపోయింది. అందుకే ఆ సృజనాత్మకత బహిర్గతమై, దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె నాగచైతన్యతో కలిసి ‘మజ్ను’లో నటిస్తోంది. అలాగే తమిళ , హిందీ భాషల్లో కూడా మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఆమెలో ఓ మంచి గాయని, సంగీత దర్శకురాలు ఉందన్న విషయం కూడా హీరోయిన్ కాకముందే తెలుసు. అప్పుడప్పుడు ఇక కవితలూ రాస్తుంటుందట. ఇలా ఎప్పటికప్పుడు తనలోని రకరకాల కళల్ని బహిరంగ పరుస్తూ, ఆల్‌రౌండర్‌ అనిపించుకొంటోంది ఈ భామ.

అన్నీ బానే వున్నాయి, కవితల వరకేనా లేక కథలు రాసే అలవాటు చేసుకొన్నారా? అడిగితే ‘కథలు రాయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అయితే చెప్పడం మాత్రం బాగా వచ్చు’ అంటూ ముసిముసిగా నవ్వుతూ చెప్పేస్తోంది. ‘‘పెద్దయ్యాక మానేశాను కానీ చిన్నప్పుడు బోలెడన్ని కట్టుకథలు చెప్పేదాన్ని. ఇంట్లో అమ్మకో కథ, స్కూల్‌కెళ్తే టీచర్‌కో కథ. స్నేహితులకోసమైతే మాయలు, మంత్రాలు జోడించి కథలు చెప్పేదాన్ని. కొన్నిసార్లు ఆ కథలు ఇంట్లోవాళ్లని ఇబ్బందులు పెట్టేవి. ఇప్పుడు కథ రాయాలనిపిస్తే సినిమా కోసమే రాస్తా. ఎప్పుడనేది చెప్పలేను' అంటూ శ్రుతి పెద్ద చిట్టాయే విప్పింది. కాకమ్మ కధలు చెప్పే శృతి అసలు కధ (సినిమా కధ) ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారట.

English summary