రాజమౌళికి ఇష్టమైన హీరో అతనే..

S.S. Rajamouli favourite hero

01:28 PM ON 19th December, 2015 By Mirchi Vilas

S.S. Rajamouli favourite hero

ఐఐటీ మద్రాస్‌ టాక్‌ సెషన్‌కి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్‌.ఎస్‌. రాజమూళిని అక్కడ ఉన్న విద్యార్ధులు మీ అభిమాన హీరో ఎవరని అడగగా మారు మాత్రం ఆలోచించకుండా నాకు ఇష్టమైన నటుడు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ అని చెప్పాడు. ఈ ఈవెంట్‌ అక్టోబర్‌లో జరగగా రాజమౌళి మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటకొచ్చి హల్‌చల్‌ చేస్తుంది. యంగ్‌టైగర్‌ కంటే ముందు రాజమౌళి ఇద్దరు హీరోలు ఇష్టం అని చెప్పారు, అందులో ఒకరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామరావు మరియు మార్షల్‌ ఆర్స్‌ సృష్టికర్త బ్రూస్‌లీ.

ప్రెజెంట్‌ అయితే యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ అని చెప్పారు. బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు పోందిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు బాహుబలి -2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2017లో విడుదలవుతుంది.


English summary

S.S. Rajamouli favourite hero is Young Tiger Ntr.