'బాహుబలి' టీమ్‌కి రాజమౌళి వార్నింగ్

S.S. Rajamouli gave serious warning to Baahubali team

02:13 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

S.S. Rajamouli gave serious warning to Baahubali team

తాజా సమాచారం ప్రకారం ఎస్‌.ఎస్‌.రాజమౌళి బాహుబలి టీమ్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడని వినిపిస్తుంది. వివరాల్లోకెళితే 'బాహుబలి' ద కంక్లూషన్' చిత్రం ఘాటింగ్‌ డిసెంబర్‌ 16న సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఈ చిత్రం ఘాటింగ్‌ ప్రారంభం కాకముందు రాజమౌళి బాహుబలి టీమ్‌ మొత్తానికి ఒక మీటింగ్‌ ఏర్పాటు చేశాడంట. ఈ మీటింగ్‌లో ఘాటింగుకి వచ్చేటప్పుడు ఏ ఒక్కరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడట. దీనికి కారణం లేకపోలేదు 'బాహుబలి ద బిగినింగ్‌' చిత్రీకరణ సమయంలో రాజమౌళి ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆ సినిమాలో వచ్చే యుద్ధ సన్నివేశాలు మేకింగ్‌ వీడియో విడుదలకు ముందే లీక్‌ అయిపోయింది.

ఈ సారి అటువంటి తప్పులేమి జరగకుండా ఏ ఒక్కరూ సెల్‌ఫోన్‌ తీసుకురాకూడదని ఆంక్షలు విధించాడట రాజమౌళి. బాహుబలి-2 కి సంబంధించి చిన్న విషయం కూడా బయటకి పొక్కకూడదని రాజమౌళి చెప్పాడట. ఈ సినిమాని తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌కు గురి కావాలని రాజమౌళి ఆలోచన.

English summary

S.S. Rajamouli gave serious warning to Baahubali team that they donot bring mobile phones for shooting.