బాలకృష్ణ-మహేష్ బాబులతో జక్కన్న మల్టీ స్టారర్

S.S. Rajamouli multi starrer with Mahesh Babu and Balakrishna

03:35 PM ON 20th June, 2016 By Mirchi Vilas

S.S. Rajamouli multi starrer with Mahesh Babu and Balakrishna

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు నాటికాలంలో మల్టీ స్టారర్లు విపరీతంగా చేసే వారు. అప్పట్లో హీరోలకి కలిసి ఉండే మనస్తత్వం కాబట్టి ఎన్ని చిత్రాలైన సరే మల్టీ స్టారర్ చిత్రాలు చేసేవారు. ఆ తరువాత తరం హీరోలకి అహం ఎక్కువని ఓ రూమర్ ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కాలంలో అయితే మల్టీ స్టారర్ చిత్రాలు రానేలేదు. ఇక ఇప్పుడు తరం వాళ్ళైతే అది ఇంకా బలపరిచారు. అయితే మళ్లీ పూర్వ వైభవాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకువచ్చి తమ అభిప్రాయాలు తప్పని నిరూపించారు. ఇప్పుడు తాజాగా మరో మల్టీ స్టారర్ చిత్రానికి తెర లేపారు.

ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ- సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారట. దీనికి సంబంధించి అసలు విషయంలోకి వెళ్తే.. నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబుల ఫ్యాన్స్ కు ఇది నిజంగా శుభవార్తే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ స్టార్స్ ఇద్దరూ కలిసి నటించే ఛాన్స్ ఉందట. ఈ మల్టీ స్టారర్ చిత్రానికి జక్కన్న మెగా ఫోన్ పట్టవచ్చునని చెబుతున్నారు. మహేష్, బాలకృష్ణ మధ్య మంచి స్నేహం, బంధం ఉన్నాయి. చాలా మందికి ఈ విషయం తెలియదు. కానీ టైమొస్తే ఇద్దరూ కలిసి పని చేయడానికి వెనుకాడరట.. వీళ్ళ డేట్స్ మీద దృష్టి పెట్టిన ఓ ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ వీరి కాంబోలో చిత్రం వచ్చే సూచన ఉందని సూత్రప్రాయంగా తెలిపింది.

మంచి స్క్రిప్ట్ ఉంటే మల్టీ స్టారర్ లో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని మహేష్ ఇదివరకే చెప్పాడు. పైగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకీతో కలిసి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాడు కూడా. ఇక బాలయ్య కూడా తన ఆప్షన్స్ ఓపెన్ చేసే ఉంచాడు. అయితే ప్రస్తుతానికి ఈ స్టార్స్ ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉందన్నది ఒక ఆలోచన మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఇది కార్యరూపం దాల్చవచ్చునని ఈ నిర్మాణ సంస్థవర్గాలు తెలిపాయి. ఏదేమైనా.. ఇది నిజమే అయితే ఇక ఈ ఇద్దరు హీరోల అభిమానులకు పండగే అని చెప్పాలి.

English summary

S.S. Rajamouli multi starrer with Mahesh Babu and Balakrishna