ముంబైలో ఆఫీస్‌ పెట్టేశాడా?

S.S. Rajamouli putting office in Mumbai

05:55 PM ON 9th February, 2016 By Mirchi Vilas

S.S. Rajamouli putting office in Mumbai

టాలీవుడ్‌ లో టాప్‌ డైరెక్టర్‌గా రాజ్యమేలుతున్న దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. తన చిత్రాలతో సెపరేట్‌ బ్రాండ్‌ ని సృష్టించుకున్న రాజమౌళి 'బాహుబలి' చిత్రం విజయంతో దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. బాహుబలి చిత్రం తరువాత అందరూ 'బాహుబలి -2' కోసం ఎదురు చూస్తున్నారు. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి విజయం తరువాత అందరూ రాజమౌళి బాలీవుడ్‌కి వెళ్ళిపోతాడా అని గుసగుసలాడుకున్నారు. అయితే దీనికి సమాధానం దొరికేసింది. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి-2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

ఆ చిత్రం ఘాటింగ్‌ అయిపోయాక రాజమౌళి బాలీవుడ్‌ లో రంగ ప్రవేశం చేయనున్నాడట. బాహుబలి ని హిందీలో ప్రెజెంట్‌ చేసిన బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ మరియు ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో రాజమౌళి ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి గ్రౌండ్‌ వర్క్స్‌ మొదలు పెట్టేశారట. దీనితో పాటు రాజమౌళి ముంబైలో ఒక పెద్ద ఆఫీస్‌ కూడా ఓపెన్‌ చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి -2' 2016 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

English summary

Star director S.S. Rajamouli putting office in Mumbai for his direction department. And also after completion of Baahubali 2 shooting he will enter in bollywood for his next movie.