తాగి డ్రైవ్ చేస్తూ అడ్డంగా దొరికిన టాప్ డైరెక్టర్ సన్

SS Rajamouli son caught to police for drunk and drive

12:43 PM ON 6th February, 2017 By Mirchi Vilas

SS Rajamouli son caught to police for drunk and drive

పెద్దోళ్ళు సంపాదించి పెడితే పిల్లలు ఎలా దుర్వినియోగం చేస్తారో, ఎలా వ్యసనాలకు లొంగిపోయి ఎలాంటి పనులు చేస్తారో రోజూ చాలా చోట్ల చూస్తూనే వున్నాం. ఇక తాగి వాహనం నడపొద్దు అంటూ ట్రాఫిక్ పోలీసులు పదే..పదే చెబుతుంటారు. అయినా, చాలా మంది ఆ ఆదేశాలను బేఖాతర్ చేస్తుంటారు. పూటుగా తాగేసి బండి లేదంటే కారు నడుపుతూ పోలీసులకు దొరికేస్తుంటారు. సెలెబ్రిటీలూ అందుకు మినహాయింపేమీ కాదు. ఇంతకుముందు చాలా మంది స్టార్లు అలా దొరికారు కూడా. తాజాగా ఓ టాప్ డైరెక్టర్ కుమారుడు కూడా తాగుతూ..వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయాడట. ఆ టాప్ డైరెక్టర్ ఎవరో కాదు.. బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి సినిమా తీసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తాగి వాహనం నడిపి దొరికిపోయింది అతడి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ.

అయితే ఆ విషయాన్ని చెప్పింది చెప్పింది ఎవరో కాదు, స్వయానా కార్తికేయ. షో టైమ్ ఆడియో లాంచ్ సందర్భంగా ఆ విషయాలను కార్తికేయ చెప్పుకొచ్చాడు . ‘‘ఒక సారి నేను డ్రంకెన్ డ్రైవ్లో పోలీసులకు దొరికపోయా. అది కూడా తాగుతూ కారు నడిపా. అది నేరమన్న సంగతి అప్పటికీ నాకు తెలియదు. ఎందుకంటే.. వాళ్లు తాగి నడపొద్దన్నారు కానీ.. తాగుతూ నడపొద్దనలేదు కదా. అందుకే.. నేను అప్పటికే కొంత మద్యం సేవించినా.. మళ్లీ మద్యం సేవిస్తూనే కారు నడిపా. దీంతో పోలీసులు నన్ను ఆపారు. అప్పుడు తెలిసింది.. అది కూడా నేరమేనన్న సంగతి’’ అని తాను చేసిన తప్పును సభాముఖంగా ఒప్పేసుకున్నాడు కార్తికేయ. కాగా, ఆ ఫంక్షన్లోనే రాజమౌళి ఉన్నాడు. ఆ విషయం చెప్పినా.. ఏమీ అనలేదు సరికదా కార్తికేయపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఫస్ట్ షో సినిమాలో తన కొడుకు అద్భుతంగా పాడాడని, ఆ సినిమాలో పాడే వరకు తన కొడుకు ఇంత అద్భుతంగా పాడతాడని తనకు తెలియదని ప్రశంసలతో ముంచెత్తాడు

ఇది కూడా చూడండి: 2017 లో మీ రాశిని బట్టి…. మీకు మంచి చేసే కలర్ ఇదే

ఇది కూడా చూడండి: ఆ సమయాల్లో తులసి ఆకులు తెంపితే ఏమౌతుందో తెలుసా

English summary

top director SS Rajamouli's son Karthikeya was caught by police for drunk and drive.