డిక్టేటర్‌ని టెన్షన్‌ పెడుతున్న 'థమన్'!!

S.S. Thaman tensioned Dictator movie producers

05:43 PM ON 11th December, 2015 By Mirchi Vilas

S.S. Thaman tensioned Dictator movie producers

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'డిక్టేటర్‌'. లౌక్యం ఫేమ్‌ శ్రీవాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు కధానాయికలు. సంక్రాంతికి విడుదలవుతుందనుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు ప్రస్తుతం థమన్‌ టెన్షన్‌ పెడుతున్నాడు. వివరాల్లోకెలితే ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ వర్క్, బ్యాక్ గ్రౌండ్‌స్కోర్‌ చెన్నైలో చేస్తున్నాడు థమన్‌. అయితే చెన్నైలో సంభవించిన భారీ వరదల వల్ల చెన్నైలో ఉన్న 'ఈయ' మ్యూజిక్‌ స్టూడియో వరదల దాటికి పూర్తిగా దెబ్బతింది.

సుమారు మూడున్నర కోట్లు నష్టం జరగడంతో పాటు స్టూడియోలో ఉన్న ఎక్విప్మెంట్‌ మొత్తం దెబ్బ తిన్నాయి. తిరిగి మళ్ళీ చెన్నై కోలుకోవడానికి, స్టూడియోలో ఎక్విప్మెంట్‌ తిరిగి రీప్లేస్ చెయ్యడానికి ఎక్కువ సమయమే పడుతుంది. అందువల్ల డిక్టేటర్‌కి సంబంధించిన మ్యూజిక్‌ పనులు జరపడం సాధ్యం కావడం లేదు. అయితే డిక్టేటర్‌లో సాంగ్స్‌ వర్క్‌ మొత్తం పూర్తయిపోయినా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ వర్క్‌ మాత్రం జరగలేదు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న పరిస్థితికి స్టూడియోలో ఎక్విప్మెంట్‌ ఏర్పాటు చేసుకుని మ్యూజిక్‌ వర్క్‌ పూర్తి చెయ్యడానికి డిక్టేటర్‌ నిర్మాతలను థమన్‌ నెల రోజులు గడువు అడిగాడట.

అంతే కాకుండా ఒకవేళ సమయం లేకపోతే మణిశర్మని కాని వేరే ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్‌ని తీసుకోమని చెప్పారట. కానీ నిర్మాతలు మాత్రం థమన్‌తోనే మ్యూజిక్‌ చెయ్యాలని ఇష్టపడుతున్నారట. దీంతో డిక్టేటర్‌ రిలీజ్‌కు థమన్‌ నిర్మాతలని తెగ టెన్షన్‌ పెడుతున్నాడు.

English summary

S.S. Thaman tensioned Dictator movie producers for composing Music for Dictator movie due to Chennai floods.