స్టాలిన్ కాదు ... నేనే సిఎమ్ అవుతా

Stalin can be CM if anything happens to me Says Karunanidhi

04:12 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Stalin can be CM if anything happens to me Says Karunanidhi

తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి పదవిని తానే చేపడుతానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే స్టాలిన్ సీఎం అవుతారంటూ సాగుతున్న దుష్ప్రచారంపై ఆయన స్పందించారు. 'ప్రకృతి నన్నేమైనా చేసేదాకా సీఎం అవడానికి నా కుమారుడు స్టాలిన్‌ వేచి ఉండాల్సిందే' అని ఆయన అనేసారు. డీఎంకే విజయం సాధిస్తే యువకుడికి పాలనపగ్గాలు అప్పగించేందుకు మార్గం సుగమం చేస్తారా అని అడుగగా.. తానే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తానని ఆయన బదులిచ్చారు. 'సీఎం అవ్వాలని స్టాలిన్‌ కూడా అనుకోవడం లేదన్నారు.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

డీఎంకే అధ్యక్షుడే (నేనే) ఆ పదవిని అధిష్టించాలని కోరుకుంటున్న వారిలో ఆయనే ప్రథముడు. 1957 నుంచి ఒక్క ఎన్నికలో కూడా నేను ఓడిపోలేదు. ఈ దఫా నేను గెలిస్తే ఆరోసారి సీఎంను అవుతాను' అన్నారు. స్టాలిన్‌ను సీఎం చేయాలని పార్టీ నేతలు కోరుకుంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయనకు ఆ అవకాశం రావాలంటే ప్రకృతి తననేమైనా చేయాలని జవాబిచ్చారు. స్టాలినే తన వారసుడని ఇది వరకే కరుణ సంకేతాలిచ్చిన సంగతి తెల్సిందే.

ఇవి కుడా చదవండి:నన్ను చంపేస్తారు అంటూ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

ఇవి కుడా చదవండి:ఎంపీలు వారంపాటు నియోజకవర్గాల్లో ఉండాల్సిందే

English summary

DMK Chief Karunanidhi says that he will be Chief Minister when his Party wins in Tamilnadu elections and he says that Stalin will be next Chief Minister if anything happens to him.