పుష్కరాల మృతుల కేసులో సాక్ష్యాలు మాయం

Stampede at Pushkar Ghat in Rajamahendravaram

10:46 AM ON 12th May, 2016 By Mirchi Vilas

Stampede at Pushkar Ghat in Rajamahendravaram

గత ఏడాది జూలైలో గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాట కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. కీలకమైన ఈ కేసులో సిసి ఫుటేజీలు మాయ మయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసి తప్పిదాన్ని అధికారులపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో

రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద తొక్కిసలాటలో 29 మంది మరణించడం 51 మంది క్షతగాత్రులైన ఘటనపై సాక్ష్యాలు మాయమయినట్లుగా తెలుస్తోంది. సీసీ టివిలు సరిగా పనిచేయలేదని ఘటనకు సంబంధించిన విజువల్సు తమ వద్దలేవని పోలీసులు చెబుతుండడం ఆరోపణలకు ఊతమిస్తోంది. ఆ దుర్ఘటనపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి సివై సోమయాజులు అధ్యక్షతన ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ గడువు జూన్ 29 వరకూ పెంచుతూ. ప్రభుత్వం జిఒ 99ను జారీ చేసింది. మార్చిలో మూడో విచారణ నాటికి 26 మంది సాక్షులు అఫిడవిడ్లను దాఖలు చేసినా ఒక్కరినీ కమిషన్ విచారించలేదు. కమిషన్ నాలుగోసారి విచారణ ప్రారంభించాల్సి ఉంది. జిల్లా యంత్రాంగం కమిషన్ కు ఇప్పటికీ ఆధారాలు సమర్పించలేదు.

ఇవి కూడా చదవండి:హైదరాబాద్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటున్న సమంత!

సిఎం చంద్రబాబు పుష్కర ఘాట్ లో ఉన్న సమయంలో యాత్రికులు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ కేంద్ర హోం శాఖకు గతంలో నివేదించారు. ఆ సమయంలో పుష్కర ఘాట్ గేట్లు తెరిచే ఉన్నాయని పోలీసులు కొత్త వాదన వినిపిస్తున్నారు. దీంతో తొక్కిసలాట ఘటనకు రాజమండ్రి అర్బన్ ఎస్ పి హరికృష్ణ - జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ను బాధ్యులుగా చేయాలన్న ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే హరికృష్ణను బదిలీచేసి విఆర్ లో ఉంచారు. ఈ సంఘటనకు సిసి కెమెరాల పుటేజీలే ఆధారం . తొక్కిసలాట రోజు ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమేరాలు సరిగా పనిచేయలేదని పోలీసులు గతంలో మీడియాకు లీకులిచ్చారు. ఇప్పుడు ఆ దృశ్యాల పుటేజీలు లేవని చెబుతున్నారు. పూర్తిగా సాక్ష్యాలను తారుమారు చేసి విచారణను మమ అనిపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసును ఓ పధకం ప్రకారం నీరుగార్చే చర్యలు మొదట నుంచీ చేస్తున్నారని బలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ కేసు ఎటు దారితీస్తుందో మరి.

ఇవి కూడా చదవండి:బతికుండగానే సమాధి చేసేసారట

English summary

The Godavari Maha Pushkarams started on a tragic note in Andhra Pradesh with 27 people breathing their last in a stampede at the Pushkar Ghat in this city on July Last year. Andhra Pradesh Government has put a committee on this incident to investigate the reasons behind this incident.