ఎన్టీఆర్ ముందు బన్నీ వేస్ట్ అన్న టాప్ కమెడియన్

Star comedian Sathyan Sivakumar praises Ntr

05:05 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Star comedian Sathyan Sivakumar praises Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల దుమ్ముదులుపుతోంది. ఇప్పుడు టాలీవుడ్ తో పాటు సినీ అభిమానులందరూ జనతా గ్యారేజ్ తో పాటు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించే చర్చించుకుంటున్నారు. తారక్ ను మెచ్చుకోని ప్రేక్షకుడు లేడు. టాలీవుడ్ లోని అందరూ ప్రముఖులు ఎన్టీఆర్ యాక్టింగ్ ను మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమా చూసిన కోలీవుడ్ స్టార్ కమెడియన్ ఒకరు ఎన్టీఆర్ ను, బన్నీని కంపేరిజన్ చేస్తూ చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. కోలీవుడ్ స్టార్ కమెడియన్ సత్యన్ శివకుమార్ జనతా గ్యారేజ్ చూసి ఎన్టీఆర్ యాక్షన్ కి ఫిదా అయిపోయాడట. ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూ ట్విట్టర్ లో తన ఆనందం పంచుకున్నాడు..

అక్కడి వరకు బాగానే ఉంది. అయితే బన్నీ కంటే ఎన్టీఆర్ సూపర్ అని చెప్పడమే సంచలనంగా మారింది. మనోడు గతంలో ఆయన బన్నీకి అభిమాని అట! దీంతో బన్నీ సరైనోడు మూవీని కూడా చూశాడంట. అయితే గ్యారేజ్ లో తారక్ రొమాంటిక్ సీన్లు బాగున్నాయి. బన్నీ ఈ విషయంలో తారక్ ను ఫాలో అవ్వాలి. బన్నీ సరైనోడు చూశాను.. నువ్వు మాస్ సినిమాల కంటే రొమాంటిక్ సినిమాల మీద కాన్సంట్రేషన్ చేస్తే బాగుంటుందని చెప్పాడు. మాస్ అంటే ఎన్టీఆర్ ఒక్కడే.. ఎన్టీఆర్ ను టచ్ చేయడం ఎవ్వరికి సాధ్యం కాదని కూడా ఆకాశానికి ఎత్తేశాడు. దీంతో ఇప్పుడు సత్యన్ శివకుమార్ కామెంట్లు చూసిన బన్నీ ఫ్యాన్స్ కాస్త ఫైర్ అయిపోతున్నారు. అదే టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లను ఎంజాయ్ చేస్తున్నారు.

English summary

Star comedian Sathyan Sivakumar praises Ntr