స్టార్ హోటల్స్ లో నయన్ చేసే పనులు ఇవా - అందుకే బ్యాన్

Star Heroine Nayantara Banned In All Star Hotels In Hyderabad.

02:59 PM ON 6th August, 2016 By Mirchi Vilas

Star Heroine Nayantara Banned In All Star Hotels In Hyderabad.

ఇదేమిటి, ఓ టాప్ హీరోయిన్ పై సినిమావాళ్లు బ్యాన్ చేస్తే ఎదో అనుకోవచ్చు గానీ స్టార్ హోటల్స్ వాళ్ళు చేయడం ఏమిటి అనుకుంటున్నారా? అవును మరి చేసే తిన్నంగా ఉంటే కదా. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, హీరోయిన్ నయనతార. అటు గ్లామర్‌తోనూ, ఇటు పెర్ఫార్మెన్స్తోనూ అభిమానులను అలరిస్తూ, దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందుకే ఈమె రెమ్యునరేషన్ ఎంత పెంచేసినా నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అయినా సినిమా వాళ్ళను కూడా తెగ ఇబ్బంది పెట్టేస్తోందట.

నిజంగా నయనతారతో ఇబ్బందులు ఆషామాషీగా ఉండవట. ముఖ్యంగా సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాదు. ఇక ఇటీవలె వెంకటేష్ సరసన ‘బాబూ బంగారం’ సినిమాలో నటించిన నయన్.. ఆ యూనిట్ సభ్యులకు చుక్కలు చూపించిందట. డేట్లు ఇచ్చి కూడా షూటింగ్‌కు హాజరుకాకుండా ఇబ్బందులు పెట్టిందట. పోనీ ఎదో అనుకుంటే, కేవలం యూనిట్ సభ్యులకే కాదు, హైదరబాద్ స్టార్ హోటల్ యజమానులకూ నయనతారతో సమస్యలేనట. ఎప్పుడూ చాలా సీరియస్‌గా ఉండే నయనతార హోటల్ లో దిగినపుడు రాద్ధాంతమే.

ఈమెకు కోపం వస్తే చట్టుపక్కల ఉన్నవన్నీ పగలగొట్టేస్తుందట. కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరు ఉంటే వారి మీద అరవడం, ఏ వస్తువు ఉంటే దాన్ని విసిరేసి, పగలగొట్టడంతోపాటు తనకిచ్చిన రూమ్ ఇంటీరియర్‌ను కూడా నాశనం చేస్తుందట. అయితే ఆతర్వాతి రోజు వాటన్నింటికీ డబ్బులు కట్టేస్తుందట. ఇది బానేవున్నా, ఆమె నాశనం చేసిన రూమ్‌ను తిరిగి బాగు చేయడానికి ఒక రోజంతా వేస్ట్ అయిపోతోందట. ఇటీవల బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్ యజమాన్యానికి నయన్ ఇలాంటి సమస్యలే తెచ్చి పెట్టడంతో హోటల్ యాజమాన్యం సీరియస్ గా ఎదో నిర్ణయం చేయాలనీ అనుకుందట. దీనికి తోడు, మరికొన్ని స్టార్‌హోటల్స్ నుంచి కూడా ఇలాంటి కంప్లైంట్లే రావడంతో వారంతా సామూహికంగా నయనతారను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అయినా ఈ అమ్మడుకి ఇదేం పని అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టేస్తున్నారు.

ఇది కూడా చూడండి: జుట్టురాలే సమస్యకు కరివేపాకు

ఇది కూడా చూడండి: గతజన్మలో ప్రేమించిన వ్యక్తిని.. ఇప్పుడు కలిశామని చెప్పే సంకేతాలు

ఇది కూడా చూడండి: 7 రోజుల్లో బరువు తగ్గడం ఎలా?

English summary

Star Heroine Nayantara Banned In All Star Hotels In Hyderabad.