సూపర్ స్టార్ చెప్పినా తగ్గలేదట..

Star Heroines Demanding High Remuneration For Mahesh Murugadoss Movie

10:32 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Star Heroines Demanding High Remuneration For Mahesh Murugadoss Movie

ఏ ముహూర్తాన మహేష్ బాబు- మురుగదాస్ న్యూప్రాజెక్ట్ ఒకే అయిందో గానీ, స్టార్ హీరోయిన్స్ దొరకడం లేదు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక వార్తలు హల్ చల్ చేయగా, తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ లో తొలుత స్టార్ హీరోయిన్స్ ని తీసుకోవాలని డైరెక్టర్ ప్లాన్ చేశాడు. అందుకోసం సమంత, శృతిహాసన్, పరిణీతి చోప్రాలను అప్రోచ్ అయ్యాడట. అందరూ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో చివరకు వాళ్లని పక్కనబెట్టి రకుల్ ని ఓకే చేసినట్టు టాక్ వచ్చింది. బైలింగ్వల్ మూవీ కావడంతో సౌత్ లో కాస్త ఫేం వున్న హీరోయిన్స్ అయితే బాగుంటుందని అనుకున్నారట.

సమంత 2.7 కోట్లు, శృతిహాసన్ 3 కోట్లు డిమాండ్ చేసినట్టు. రెమ్యునరేషన్ విషయంలో కాస్త తగ్గించుకోవాలని చెప్పినా ఇద్దరు వినలేదని తెగ గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా వార్తలు చోటుచేసుకున్నాయి. మహేష్ ఎంటరై, రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదట. ఆ తర్వాత పరిణీతి చోప్రాని సౌత్ ప్రాజెక్ట్ లో నటించాలని అడిగితే ఏకంగా 5 కోట్లు కావాలని మెలిక పెట్టినట్టు చెబుతున్నారు. దీంతో మహేష్ వాళ్ళిద్దరినీ పక్కనపెట్టి రకుల్ ని కోటికి ఓకే చేసినట్టు ప్రచారం సాగుతోంది. హీరోయిన్ ఓకే కావడంతో ఈ మంత్ చివరి నాటికి నటీనటులను ఓకే చేసి ఆగస్టు ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి వెళ్లాలని మురుగదాస్ ప్లాన్. మరి ఇప్పుడైనా సజావుగా వ్యవహారం నడుస్తుందా?

ఇవి కూడా చదవండి:తొలి ఏకాదశి పండగలో దాగిన రహస్యాలు

ఇవి కూడా చదవండి:రజినీ-కమల్ లు ఎందుకు కలిసి నటించరో తెలుసా!

English summary

Super Star Mahesh Babu was presently signed a movie with Tamil Director A.R.Murugadoss and this movie heroine was not yet confirmed because Star Heroines were demanding High Remuneration for this Bilingual Movie.