హీరోయిన్ ని చేస్తానని చాందిని చౌదరిని మోసం చేసిన నిర్మాత ఎవరు?

Star producer cheated Chandini chowdary

12:11 PM ON 25th June, 2016 By Mirchi Vilas

Star producer cheated Chandini chowdary

హీరోహీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిపోవాలని ఎంతో మంది ఈ రంగుల ప్రపంచంలోకి రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు. తమని తాము ఒక్కసారి తెరపై చూసుకుని మురిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇక చాలా మంది సాంకేతికనిపుణులు అవుదామని వచ్చి టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు లేక అలాగే ఉండిపోతుంటారు. ఇలా వచ్చినవారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే విజయతీరాలు చేరతారు, మిగిలిన వారు అదృష్టం బాగుంటే తిరిగి ఇంటికి వెళ్తారు, లేదంటే ఈ మాయలోనే ఇరుక్కుపోయి తమ జీవితాలను నాశనం చేసుకొంటారు. ఇలా ఎన్నో ఆశలతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన..

ఓ షార్ట్ ఫిలిం హీరోయిన్ ఓ స్టార్ నిర్మాత చేతిలో పడి ఇరుక్కుపోయి ఎట్టకేలకు అక్కడ నుంచి బయటపడి ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతోందన్న టాక్ ఇండస్ర్టీలో జోరుగా హల్ చల్ చేస్తోంది. అప్ కమింగ్ హీరోయిన్ చాందిని చౌదరి. ఈ అమ్మడు 2012లోనే తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా.. ఓ స్టార్ నిర్మాత ఆమెతో రెండేళ్ళ అగ్రిమెంట్ చేసుకొని తన సినిమాలో నటించనివ్వక, వేరే సినిమా చేసుకోనివ్వక చాలా ఇబ్బంది పెట్టాడట. అందువల్ల చాందిని కెరీర్ రెండేళ్లపాటు దిక్కుతోచక ఊగిసలాడిందట. మొత్తం మీద చాందిని ఆ స్టార్ నిర్మాత వల నుంచి బయట పడింది.

ఇప్పుడు ఆమె అదృష్టం బాగుండి.. ఇప్పుడు హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకొంటూ కెరీర్లో దూసుకుపోతోంది.

English summary

Star producer cheated Chandini chowdary