బాధ్యత లేని హన్సిక పై నిర్మాత కేసు..

Star producer want to put case on Hansika

10:51 AM ON 21st July, 2016 By Mirchi Vilas

Star producer want to put case on Hansika

ఒక్కోసారి చేసిన మంచిని మరో అంశం మింగేస్తుంది. హీరోయిన్ హన్సిక విషయంలో అదే జరిగింది. అర్ధరాత్రి పూట అనాథ పిల్లలకు, రోడ్డు మీద పడుకున్న అభాగ్యులకు.. ఇటీవలే దుప్పట్లూ తిండీ అందిస్తున్న హన్సిక తాలూకు ఒక వీడియో బయటకు రావడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ వారి ఆనందం చాలా ఫాస్టుగా ఆవిరపైపోయేలా మరో ఘటన వచ్చి పడింది. అదేమంటే, ఈమె చాలా బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తోందంటూ ఇప్పుడు ఒక తమిళ నిర్మాత ఆమెపై కేసు పెట్టబోతున్నారు. హన్సికను హీరోయిన్ గా 'పులి', 'పోకిరి రాజా' సినిమాలకు తీసుకున్న నిర్మాత పిటి సెల్వకుమార్, ఇప్పుడు ఆమెపై కేసు పెడతారట.

ఈ రెండు సినిమాల రిజల్టు అట్టర్ ప్లాప్ అవ్వడం ఒకెత్తయితే, జీవా హీరోగా రూపొందిన 'పోకిరి రాజా' సినిమా ప్రమోషన్లకు హన్సిక హ్యాండిచ్చేసింది. కోవై నగరంలో చేపట్టిన ఆడియో ఫంక్షన్ కు, హన్సిక కోసం అప్పటికే 5 స్టార్ హోటల్ బుక్ చేసి, ఆమె కోసం డిజైనర్ డ్రెస్ కు డబ్బులు చెల్లించి, ట్రావెల్ ఎరేంజ్మెంట్స్ అన్నీ చేసినా కూడా అమ్మడు హ్యాండిచ్చేసిందట. ఈ విషయంపై ప్రశ్నిస్తే, సరిగ్గా స్పందించకపోగా కనీసం ఈ ఖర్చంతా మాకు తిరిగిచ్చేయ్ అంటే కూడా అమ్మడు మినిమం రెస్పాండ్ కావట్లేదు అంటున్నారు నిర్మాత. ఇదే విషయమై ఇప్పుడు ఆయన హన్సికపై చీటింగ్ కేసును నమోదు చేయనున్నారు.

ఇప్పుడు విక్రమ్ తో 'ఇరుమగన్ సినిమాను' రూపొందించిన ఈ నిర్మాతకు ఒక యాంగిల్లో చూస్తే హన్సిక మీద ఖర్చు పెట్టిన ఆ మొత్తం పెద్ద ఎమౌంటే కాదని అంటున్నారు. మహా అయితే ఒక 5 లక్షలు వేస్ట్ అయ్యుంటాయ్. అయినాసరే ఈయన హన్సిక మీద ఎందుకు అంత పంతం పట్టేశారనేది ఎవ్వరికీ అర్ధంకాని విషయంగా ఉందని అంటున్నారు. అయినా ఈ మధ్య ప్రతిదానికి సినీ ఇండస్ట్రీలో వాళ్ళు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కడం అలవాటైపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary

Star producer want to put case on Hansika