ముహూర్త బలాల లోపమే కారణమా ?

State and Central Oath Muhurtham Not Nice

12:54 PM ON 7th December, 2015 By Mirchi Vilas

State and Central Oath Muhurtham Not Nice

జాతకాలు , ముహూర్తాలు నమ్మే వాళ్ళు వున్నారు. కొట్టి పారేసేవారూ వున్నారు. అయితే ఏ పని చేసినా ముహూర్తం చూసుకునీ మరీ చేయడం చూస్తుంటాం. ,ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే తప్పుడు కూడా ముహూర్తం నిర్ణయించుకుని చేయడం కూడా ఎక్కువే , ఇందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఎపిలో టిడిపి , కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడంతో కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ , ఎపిలో సిఎమ్ గా చంద్రబాబు పగ్గాలు చేపట్టారు. ముహూర్తం ప్రకారం ప్రభుత్వాలు కొలువు దీరాయి.

ముఖ్యంగా ఎపి సిఎమ్ చంద్రబాబు కి ముహూర్తాన్ని శ్రీనివాస గార్గేయ నిర్ణయించారు. అట్టహాసంగా పలు రాష్ట్రాల సిఎమ్ లను , కేంద్ర నేతలను ఆహ్వానించి , సిఎమ్ గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. అయితే అటు కేంద్రంలో,ఇటు ఎపిలో నేతలు ప్రమాణం చేసిన ముహూర్తం బాగోలేదని , దీనివల్ల ఇబ్బందులు వస్తాయని విశాఖ జిల్లా చిన ముషిడి వాడకు చెందిన శ్రీ శారదా పీఠాది పతులు శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు.

ఇక ఎపిలో గత ఏడాది హుదూద్ తుపాన్ ,గోదావరి పుష్కరాలలో దాదాపు 30 మంది తొక్కిసలాటలో మరణించడం , ఇప్పుడు చెన్నైలో వరద బీభత్సం , ఎపిలో చిత్తూరు , నెల్లూరు తదితర జిల్లాల్లో వానల దెబ్బ , వంటి పరిణామాల నేపదంలో శ్రీస్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట దగ్గర మీదయా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో , రాష్ట్రంలో ప్రమాణ స్వీకార ముహూర్తంలో లోపం వలెనే ఉపద్రవాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. దోష నివారణకు శాంతి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.

నిజంగా ముహూర్త బలం లోపమే ఉపద్రవాలకు కారణమా ? ఒకవేళ అదే అయితే ముహూర్తం నమ్మే మన నేతలు సరిదిద్దే చర్యలు చేస్తారా ? లేదా అనేది వేచి చూడాలి ...

English summary

Sri sarada peetaadhi pathi sri swaroopananda saraswathi says that the oath muhurtham's of central and state governments were not good