పెళ్లికాని జంటల కోసం స్టే అంకుల్

Stay Uncle Provides Hotel Rooms For Unmarried Indian Couples

06:56 PM ON 13th April, 2016 By Mirchi Vilas

Stay Uncle Provides Hotel Rooms For Unmarried Indian Couples

పెళ్లి కాని జంటలు ఏకాంతంగా కలుసుకోవాలంటే ఇండియా లాంటి సాంప్రదాయలకు పెద్దపీట వేసే దేశాల్లో కొద్దిగా ఇబ్బంది పడాలి ఎందుకంటే మనకునా రూల్స్ అటువంటివి . పబ్లిక్‌ ప్లేస్‌ల్లో ,పార్కుల్లో కలుసుకోవాలంటే కాస్త కష్టమనే చెప్పాలి . పోనీ ఏదైనా హోటల్లో రూమ్‌ తీసుకుందామనుకుంటే పోలీసులకు దొరికిపోతామేమోనని భయం వెంటాడుతు ఉంటుంది. నిజానికి పెళ్లి కాని జంటలు ఏకాంతంగా గడపకూడదని రాజ్యాంగంలో కానీ, ఇతర చట్టాలలో కానీ లేదు. దీన్నే అదునుగా తీసుకుని వారి కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు బిట్స్‌ పిలానీ విద్యార్థి సంచిత్‌.

‘స్టే అంకుల్‌’ అనే పేరుతో ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించి అందులో పెళ్లి కాని జంటలు కలుసుకోవడం కోసం రూమ్స్ అద్దెకిస్తున్నాడు. ఈ స్టే అంకుల్ భారత్ లోని పలు హోటళ్లతో అనుసంధానమై గదులు బుక్‌ చేసి కావాల్సిన వారికి రెంట్ కి ఇస్తుంది . రూమ్ ల కోసం రెండు నుంచి ఏడు వేల వరకు వసూలు చేస్తారు. ఈ రూముల్లో ఎలాంటి భయము లేకుండా పెళ్లి కాని జంటలు హాయిగా గడపవచ్చు. అయితే ఇలా ఏకాంతంగా గడపాలనుకున్న జంటలు ముందుగా ప్రభుత్వం జారి చేసిన ఐడి కార్డులు చూపించవలసి ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో వివిధ నగరాల్లో తమతో అనుసంధానమైన హోటళ్ల లిస్టు ఉంటుంది , వాటిలో ఏదో హోటల్‌ ను ఎంపిక చేసుకుని గది అద్దెకు తీసుకోవడమే. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ప్రస్తుతం దీనికి ఆదరణ క్రమంగా పెరుగుతోందని దీని సృష్టికర్త సంచిత్‌ తెలిపారు. 

ఇవి కూడా చూడండి:

క్లాస్ రూమ్ లో రికార్డింగ్ డాన్స్ చేసిన టీచర్(వీడియో)

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని కాల్చి పడేసిన తల్లి(వీడియో)

English summary

A New WebSite named "Stay Uncle" was providing rooms for Unmarried couple all Over India. This website provides hotel rooms for unmarried couple by showing Government ID proofs.