కూతురికి మత్తిచ్చి వ్యభిచార కూపంలో దింపిన తల్లి 

Step Mother forces her daughter into prostitution

05:52 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Step Mother forces her daughter into prostitution

తల్లంటే దైవం... అందునా ఆడపిల్లను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. కానీ ఇందుకు విరుద్ధంగా భాగ్యనగరంలోని పాతబస్తీలో దారుణం వెలుగు చూసింది. తల్లే.. బలవంతంగా కూతురును వ్యభిచారి వృత్తిలోకి దించి ఆమె జీవితాన్ని నాశనం చేసింది. కూతురికి మత్తు మందు ఇచ్చి, స్టార్ హోటళ్లకు పంపించి వ్యభిచారం చేయించింది. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? ఈ కసాయి తల్లి చేసిన దారణం వెలుగు చూడటంతో స్థానికులు షాకింగ్ కి గురయ్యారు. ఆ మహాతల్లికి శాపనార్థాలు పెట్టారు. బాధితురాలి తండ్రిని ఐదో వివాహం చేసుకున్న ఆ మహాతల్లి, అదేనండి సవతి తల్లి... అమ్మా అనే పిలుపుకే అర్ధం మార్చేసింది. తన భర్త మెదటి భార్యకు జన్మించిన కూతురు డిగ్రీ పూర్తి చేసింది.

అయితే పై చదువులకు చుదువకునేందుకు ఆ సవతి తల్లి అంగీకరించలేదు సరి కదా అమెతో బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపేందుకు యత్నించింది. తాను వ్యభిచారం చేయనని తెగేసి చెప్పిన కూతురికి మత్తుమందు ఇచ్చి.. వ్యభిచారం చేయిందచేందుకు యత్నించిందని బాధితురాలు తెలిపింది. పలుమార్లు తనకు మత్తుమందు ఇచ్చిన తరువాత స్టార్ హోటళ్లకు పంపించిందని తెలిపింది. అదే అదునుగా చేసుకున్న బాధితురాలు తనను తాను కాపాడుకునేందుకు ఇదే మంచి తరుణమని అక్కడి నుంచి తప్పించుకుంది. మరుసటి రోజు తమ బంధువుల ఇంటికి చేరుకుని అక్కడ తల దాచుకుంది. ఈ విషయం తెలిసిన సవతి తల్లి, రౌడీలతో వెళ్లి అక్కడ గొడవ చేసింది.

అంతే కాకుండా తన కూతురు కనిపించడం లేదంటూ, బంగారం దొంగలించిందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ యువతి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై, జరిగిన విషయం పోలీసులకు చెప్పేసింది. తన తల్లి తనను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపాలని యత్నించిందని, అందుకోసం తనకు మత్తుమందు కూడా ఇచ్చి అపస్మారక స్థితిలో ఉన్న తనను స్టార్ హోట్లళ్లకు పంపాలని కూడా చూసిందని.. తనకు ఇష్టంలేక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు వివరిస్తూ, ఫిర్యాదు చేసింది. స్థానికులు కూడా అండగా నిలిచి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు.

పోలీసులు కేసు నమోదు చేసి, సవతి తల్లితో పాటు రౌడీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన సవతి తల్లిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేసారు.

English summary

Step Mother forces her daughter into prostitution. Bad step mother forces her daughter into prostitution in Hyderabad.