చుండ్రుని వదిలించుకోండిలా!!!

Steps to prevent dandruff

07:33 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Steps to prevent dandruff

బయట తిరిగే ప్రతి ఒక్కరికీ ఉండే పెద్ద సమస్య చుండ్రు. ప్రస్తుత బిజీ లైఫ్ లో చుండ్రు వల్ల బాధ పడే వారి సంఖ్య రోజు రోజూకి ఎక్కువయిపోతుంది. చలికాలం లో మరి ఎక్కువ గా ఈ సమస్య వేదిస్తుంది. ఎక్కువ చుండ్రు తో బాధ పడే వాళ్ళు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడతారు. అలాగే చుండ్రు ఉన్న వారికి మొటిమల సమస్య తలెత్తుతుంది. సాద్యమైనంత వరకు చుండ్రు ని దరిచేరకుండా చూసుకోవాలి. కొంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేక చాలా బాధ పడుతూ ఉంటారు. దీనికి అద్బుతమైన పరిష్కారం వేపాకు.

వేపాకు లో చాలా ఔషద గుణాలు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ గుణాలు కలిగిన వేపాకు చుండ్రుని నివారించడం లో చక్కగా పని చేస్తుంది. ఇది తలలో వచ్చే అన్ని రకాల సమస్యలని అరికడుతుంది. ఇది మొటిమలు, దురదలు మొదలగు చర్మ సమస్యల నుండి దూరం చేస్తుంది. సహజ సిద్దమైన వేపాకు వలన ఎటువంటి హాని ఉండదు ఎటువంటి చర్మానికి అయిన ఇది చక్కటి ఔషదం. నులి పురుగులకి, మదుమేహానికీ, అలర్జీ కి, పొడి బారిన తలకి ఇంకా అనేక ఉధర సంబంధ వ్యాదులకి కూడా వేపాకు అద్భుతం గా పని చేస్తుంది.

వేపాకుతో చుండ్రు ను నివారించడానికి కొన్ని పద్దతులు:

వేపాకు, పెరుగు, మెంతులు:

వేపాకు లో మరియు మెంతులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. మెంతులు జుట్టుని వొత్తు గా పెరగడం లో సహాయపడుతుంది. ఇది జుట్టు ని నిగారించేలా చేస్తుంది. మెంతులు శరీరం లోని వేడి ని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉండేలా చూస్తుంది. అధిక వేడి ని నీరోదిస్తుంది. పెరుగు కండిషనర్ లాగాపని చేస్తుంది. ఈ మూడిటిని కలిపి ప్యాక్ వేసుకోవడం వలన జుట్టు పెరగడమే కాకుండా చుండ్రు, దురదలు, తలనొప్పి, అదిక వేడి నుండి విముక్తి లబిస్తుంది.

తయారు చేయు విధానం:

నానపెట్టిన మెంతులు, వేపాకు, పెరుగు ఈ మూడింటిని సమానముగా తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి.

ఉపయోగించే పద్దతి:

తయారు చేసిన పేస్ట్ ని తలకు పట్టించి అది బట్టలకు అంటుకోకుండా జాగ్రత వహించాలి.

గంట సమయం గడిచాక తలను నీటి తో శుబ్రపరుచుకోవాలి.

వేపాకు, కొబ్బరినూనె:

ఈ రెండిటిలో చాలా ఔషద గుణాలు ఉన్నాయి. చుండ్రు నివారణకి ఈ రెండిటి కలయిక అయిన వేపనూనె మంచి ఫలితాన్ని ఇస్తుంది.

తయారు చేయు విధానం:

కొబ్బరి నూనెను, వేపనూనెను సమ పాళ్ళలో తీసుకొని రెండిటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

ఉపయోగించే పద్దతి:

వచ్చిన మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన పేలు సమస్య ఇంకా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

మీకు ఇలా చేయడానికి సమయం లేదు అనుకుంటే వారానికి ఒక సారి, మరిగిన వేడి నీటిలో వేపాకు వేసుకొని స్నానం చేయడం వలన చర్మ సమస్యలను అరికడుతుంది.

English summary

Steps to prevent dandruff. Dandruff, also known as seborrheic dermatitis is a common scalp disorder.