హెలికాప్టర్ నుంచి దూకే స్టంట్ చేస్తూ మరణించిన జేమ్స్ బాండ్!

Steve Truglia died in helicopter stunt

11:53 AM ON 21st November, 2016 By Mirchi Vilas

Steve Truglia died in helicopter stunt

సాహసం చేయరా డింభకా అంటారు కదా. కానీ శృతి మించితే ఏదైనా ప్రమాదం అనే విషయం గుర్తుంచుకోవాలి. లేకుంటే, ప్రాణాలే పోతాయి. దీంతో వాళ్లపై ఆధారపడ్డ కొందరి జీవితాల్లో విషాదం అలుముకుంటుంది. ముఖ్యంగా సినిమాల్లో చేసే గగుర్పాటు ఘటనలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో కన్నడ సినిమా షూటింగ్ లో క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో హెలికాఫ్టర్ నుంచి సరస్సులోకి దూకిన ఘటనలో ఇద్దరు నటులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం ముగియక ముందే తాజాగా హాలీవుడ్ జేమ్స్ బాండ్ స్టంట్ మాన్, మాజీ ఎస్ఏఎస్ హీరో స్టీవ్ ట్రుగ్లియా గురువారం దుర్మరణం పాలయ్యారు.

1/3 Pages

300 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి స్టంట్ చేస్తూ దూకడంతో ఈ ప్రమాదం జరిగింది. తూర్పు లండన్ కు చెందిన 54 ఏళ్ళ ట్రుగ్లియా నైరుతి చైనాలోని చోంగ్ కింగ్ లో చేసిన స్టంట్ ఆయన మరణానికి కారణమైంది. ట్రుగ్లియాకు ప్యారాచూటింగ్, పర్వతారోహణలో అనేక పురస్కారాలు లభించాయి.

English summary

Steve Truglia died in helicopter stunt