కారూపోయింది.. కుక్కాపోయింది..

Stole Police Car With Police Dog

05:02 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Stole Police Car With Police Dog

ఇటీవల దొంగతనాలు చాలా ఎక్కువైపోయాయి. నడుచుకుని వెళ్తుంటే గొలుసు లాక్కుపోవడం,అర్ధరాత్రులు ఇళ్ల పై చొరబడి అమూల్యమైన నగలు,వస్తువులు దొంగిలించడం ఇలా చాలా వింటుంటాం.చాలా మంది భద్రత కోసం పెంపుడు కుక్కలను పెంచుకుంటారు ఎవరైనా అపరిచితులను చూస్తే అవి అరిచి గోల చేస్తాయి.అలాంటిది ఒక కుక్క దొంగలించబడింది అంటే వింతగా ఉంది కదూ. పైగా అది పొలీస్‌ కారు అందులో వెనుక సీటులో హ్యాంట్లర్‌ యొక్క కుక్క ఉంది కారుతో పాటు ఆదొంగ కుక్కని కూడా తీసుకువెళ్ళిపోయాడు.దీంతో డిటెక్టివ్స్‌ ఆ నిందితుడి కోసం వెతుకుతున్నారు.

హ్యాంట్లర్‌ అనే పోలీసు అధికారి రోడ్డుపక్కన మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఆపి విచారణ నిర్వహిస్తుండగా ఒక దుండగుడు అతడిపై దాడి చేసి ఆ కారుని దొంగిలించాడు. అలా చాలా దూరం ప్రయాణించిన అనంతరం నిందితుడు కారుని ఆపి పోలీసులకు చిక్కుకున్నాడు. 35 సంవత్సరాలు కలిగిన టోనీటర్నర్‌ అనే ఈ దొంగ ఆఖరికి పట్టుబడ్డాడు.ఈ ఘర్షణలో పోలీస్‌ అధికారికి చిన్న దెబ్బలు తగలడంతో హాస్పటల్‌ లో చికిత్స పొందుతున్నాడు.పోలీసు కుక్కకి మాత్రం ఏ హానీ జరలేదట. పోలీసులనే దోచుకునేందుకు తెగబడ్డ దొంగోడికి తగిన శాస్తి జరిగింది.

English summary

Man who 'stole police car with handler's dog in the back seat' is hunted by detectives