పేపర్ తో కరెంట్ ను స్టోర్ చేసేద్దాం..

Storage Of Power By Using Paper

04:19 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Storage Of Power By Using Paper

బ్యాటరీలు.. కెపాసిటర్ల సాయంతో విద్యుత్ ను నిల్వ చేస్తారని తెలుసు. కానీ పేపర్ తో కరెంట్ ను స్టోర్ చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా.. అయినా ఇది నిజం. విద్యుత్ ను నిల్వ చేసే ఓ కొత్త పేపర్ ను రూపొందించారు శాస్త్రవేత్తలు. దీని పేరే ‘పవర్ పేపర్’. చూడటానికి ప్లాస్టిక్ పేపర్ మాదిరిగా ఉండే ఈ పేపర్ క్షణాల్లో చార్జ్ అవుతుంది. దీంతో వందసార్లు చార్జింగ్ చేసుకోవచ్చట. నానో సెల్యూలోస్, ఫైబర్, పాలిమర్ ల సాయంతో నీటిని ఒత్తిడికి గురి చేసి ఈ పేపర్ ను తయారు చేశారు స్విడన్ పరిశోధకులు. అయితే ఇందులో ఎటుంటి ప్రమాదకర రసాయనాలను వినియోగించలేదు. రెన్యువబుల్ ఎనర్జీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పవర్ పేపర్ లాంటి పరికరాల అవసరం ఎంతో ఉందని వీరు చెపుతున్నారు.

English summary

Sweden Scientists invented a chargable paper called "Power Paper" which was used to store power in that paper