బంగారు పతకం గెల్చిన మరియప్పన్ జీవితం గురించి తెలియని విచారకర విషయాలు!

Story behind Mariyappan sad life

04:39 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Story behind Mariyappan sad life

ఆత్మస్థయిర్యం ఉంటే ఎన్ని కష్టాలనైనా అధిగమించే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తమిళ తంబీ తంగవేలు మారియప్పన్ నిరూపించాడు. కష్టించే తత్వం ఉన్నవాళ్ళు ఆ కష్టం, ఈ నష్టం అంటూ సాకులు చెప్పకుండా, మట్టిలో పడిన విత్తనంలా, పది మందికి నీడనిచ్చే చెట్టులా ఎదగుతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. రియో పారాలింపిక్స్ లో టీ-42 హైజంప్ ఈవెంట్ లో బంగారు పతకం సాధించిన మరియప్పన్ తంగవేలు జీవితం అలాంటిదే. ఆకాశాన్ని ముద్దాడే గాలిపటానికి రివ్వున వీచే ఎదురు గాలే ఆధారంగా అతడు ఎదిగాడు. అయితే అతని గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాల్సి వుంది.

1/5 Pages

మరియప్పన్ తమిళనాడులోని సేలం జిల్లా, పెరియవదగంపట్టి గ్రామంలో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులకు నలుగురు సంతానం. అతడు ఐదేళ్ళ వయసులో ఓ ఆర్టీసీ బస్సు ఢీకొని కుడికాలి మోకాలు చితికిపోయింది. దాంతో శాశ్వత అంగవైకల్యం ఏర్పడింది. అయినా మరియప్పన్ కుంగిపోలేదు. ఇక తండ్రి పదేళ్ళ క్రితమే కుటుంబాన్ని వదిలిపెట్టేశాడు. దీంతో ఆయన తల్లి సరోజ నలుగురు పిల్లలను పోషిస్తున్నారు. మారియప్పన్ సైకిల్ పై కూరగాయలను తీసుకెళ్ళి అమ్ముతూ రోజుకు దాదాపు రూ.200 వరకు సంపాదిస్తారు. అప్పుడప్పుడూ కూలి పనికి కూడా వెళ్తూ ఉంటారు.

English summary

Story behind Mariyappan sad life. Olympics gold winner Mariyappan secrets and story of his sad life.