వినాయక చవితికి 21 పత్రాలతో పూజ.. నిమజ్జనం వెనుక అసలు కధ తెలుసా?

Story behind Vinayaka puja and Vinayaka nimajjanam

02:38 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Story behind Vinayaka puja and Vinayaka nimajjanam

వినాయక చవితి అంటే అందరికీ పండగే. విఘ్నాలు తొలగించే వినాయకుడు. ప్రమథ గణాధిపతి... గణనాధుడు... విఘ్నేశ్వరుడు... ఇలా ఎన్నో పేర్లతో వినాయకుణ్ణి పిలుస్తాం. విద్యారంభంలో వచ్చే వినాయక చవితి అంటే, పిల్లలకు ఎంతో ముఖ్యమైనది. అటువంటి వినాయక చవితికి ఊరూరా పందిళ్లు వేసి గణపతి నవరాత్రులు చేస్తారు. ఇక వినాయకుణ్ణి పూజించడానికి వివిధ రకాల పత్రి, పూలతో పూజిస్తారు. ముఖ్యంగా తొమ్మిది రకాలను ఎంచుకుంటారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పత్రితో పూజా విధానం రూపొందించారని అంటారు.

ఇక వినాయక చవితి అంటే ముఖ్యంగా మూడు కార్యక్రమాలు తప్పనిసరిగా ఉంటాయి. విగ్రహం తేవడం, మండపాల్లో పెట్టి నవరాత్రుల పాటూ పూజించడం, ఆఖరుగా నిమజ్జనం చేయడం. అసలు ఎందుకు వినాయకుడి విగ్రహాలనే నిమజ్జనం చేస్తారు? అందులో ఏమైనా సామాజిక- ఆయుర్వేద- ఆధ్యాత్మిక- విశేషాలు దాగివున్నాయా? నిమజ్జనం వచ్చిందంటే చాలు గణపతి బప్పామోరియా నినాదాలు మిన్నంటుతాయి. వూరూరా- వాడవాడలా వినాయక విగ్రహాలు వూరేగుతూ ఏ చెరువులు గుంటల్లోనూ నిమజ్జనమవుతాయి. అత్యంత పవిత్రంగా విగ్రహాలు పెట్టి.. పూజాధికాలు నిర్వహించి.. గంగలో కలపడం వెనుక అంతరార్ధం ఏంటి? వంటి విషయాలు తెలుసుకుందాం..

1/32 Pages

1. స్వాతంత్ర్య సమరంలో సైతం...


గణపతి పుట్టుక- పూజ- నుంచి నిమజ్జనం వరకూ ప్రతిదానిలో సామాజిక, ఆయుర్వేద, ఇతర పర్యావరణ కోణాలు అకళింపు చేసుకోవాలి. అసలు భారతీయులు వినాయక చవితి ఇంతలా జరుపుకోడానికి కారణం తెల్లదొరలకు వ్యతిరేకంగా చర్చలు జరపడానికి. అలా స్వాతంత్ర సమరంలో పాల్గొంటున్న వారందరూ ఒక చోట చేరడానికి వేదికగా మారింది వినాయక చవితి వేడుక. అందుకే స్వాతంత్ర్య సమర సమయంలో బాలగంగాధర్ తిలక్ వంటి నేతలు ఈ దృష్టితోనే వినాయక చవితిని భారీ ఎత్తున చేయడం ప్రారంభించారు.

English summary

Story behind Vinayaka puja and Vinayaka nimajjanam