'దేవిశ్రీప్రసాద్‌' తండ్రి కన్నుమూత!

Story writer Satyamurthy has been expired today in chennai

11:34 AM ON 14th December, 2015 By Mirchi Vilas

Story writer Satyamurthy has been expired today in chennai

ప్రముఖ సినీ రచయిత, గేయ రచయత అయిన గొర్తి సత్యమూర్తి గారు ఈ రోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఈయన గేయ రచయితగా దాదాపు 90 కి పైగా సినిమాలకు పనిచేశారు. శోభన్‌బాబు కెరీర్‌లో సూపర్‌ హిట్‌ అయిన 'దేవత' చిత్రంతో రచయితగా తన కెరీర్‌ను ఆరంభించిన సత్యమూర్తి గారు ఆ తరువాత ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు పని చేశారు. అందులో ఖైదీ నెం. 786, ఛాలెంజ్‌, భలేదొంగ, బంగారు బుల్లోడు, అభిలాష లాంటి సూపర్‌ డూపర్‌ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వెలిగొందుతున్న దేవీశ్రీప్రసాద్‌ తండ్రి గారే సత్యమూర్తి.

తండ్రి మరణాంతర వార్త విన్న దేవిశ్రీప్రసాద్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీనితో దేవిశ్రీప్రసాద్‌ కుటుంబం మొత్తం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. చెన్నైలో అతని స్వగృహంలో ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు చేయనున్నారు.
సత్యమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని మిర్చివిలాస్‌.కామ్‌ తరపున సంతాపం తెలియజేస్తున్నాం.

English summary

Story writer Satyamurthy has been expired today in chennai with severe Heart attack.