ఊహకు అందని వింత ప్రదేశాలు

Strange places in World

12:24 PM ON 18th April, 2016 By Mirchi Vilas

Strange places in World

మనం ఏది విసిరినా తిరిగి నేలమీదకే పడుతుంది. ఈ విషయాల గురించి మనం చిన్నప్పుడే స్కూల్లో చదువుకున్నాం. అయితే ఈ గురుత్వాకర్షణ సిద్దాంతానికి  వ్యతిరేకంగా మన దేశంలో కొన్ని ఆశ్చర్యకరమైన వింత ప్రదేశాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్ధాం. నీటిపై తేలియాడే రాళ్లు, ఐలాండ్లు ఎక్కడ ఉన్నాయో వాటి వివరాలను స్లైడ్ షోలో చూడండి.

ఇది కుడా చదవండి: ఐదు ప్రదేశాల మిస్టరీ వెనుక లాజిక్

ఇది కుడా చదవండి:భయపెట్టే చారిత్రాత్మక కట్టడాలు

ఇది కుడా చదవండి: ఇండియాలో భయంకరమైన ప్రదేశాలు

1/7 Pages

కృష్ణాస్ బటర్ బాల్

మహాబలిపురం చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మహాబలిపురంలో ఒక రాయి చాలా వింతగా గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉంటుంది. ఈ రాయి ఎప్పుడు పడిపోతుందా అనే విధంగా ఉంటుంది కానీ పడదట. బల్ల పరుపుగా ఉన్న రాయిపై 45 డిగ్రీల కోణంలో వాలిపోయి ఈవింత రాయి ఉందట. వ్యాసం 5 మీటర్లు 25 టన్నుల బరువు కలిగిన ఈ రాయిని 1908లో మద్రాస్ గవర్నర్ ఆ రాయిని 7 ఏనుగుల సాయంతో తీసేయాలని ట్రై చేసారట. కానీ ఆరాయి ఒక్క ఇంచు కూడా కదలలేదు. ఈ రాయి గురించి స్థానికులు ఒక కధ చెబుతుంటారు. శ్రీ కృష్ణుడికి వెన్న అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు అతడు వెన్న కోసం చిలిపి పనులు చేసి వెన్నను దొంగలించేవాడు. వెన్నని దొంగలిస్తాడనే భయంతో కొందరు తమ వెన్నను ఈ రాయిలో దాచుకున్నారట. అప్పటి నుండి ఈ రాయి కదల లేదని అలాగే నిలిచిపోయిందని అక్కడివారు చెప్తుంటారు. ఇంకొంత మంది ఈ రాయి స్వర్గం నుండి వచ్చిందని దేవుళ్ళు మాత్రమే కదపగలరని అంటుంటారు. ఈ రాయిని అక్కడి ప్రజలు కృష్ణాస్ బటర్ బాల్ అని పిలుస్తారట.

English summary

Every corner of this wonderland has something waiting to be unraveled, just like these places..