చనిపోయిన వాళ్ళు కలలోకి వస్తే అలా అవుతుందా?

Strangest Facts About Your Dreams

11:58 AM ON 25th June, 2016 By Mirchi Vilas

Strangest Facts About Your Dreams

'కలలు కనండి వారిని సాకారం చేసుకోండి' అంటూ సైకాలజిష్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతూ, వుంటారు. అయితే దీని మాట ఎలా వున్నా, మనం పడుకున్న తర్వాత చాలా సార్లు ఎన్నో కలలు వస్తుంటాయి. కొన్ని గుర్తుంటాయి. మరికొన్ని మర్చిపోతుంటాం. తెల్లవారుజాము వచ్చే కలలు నిజం అవుతాయని అంటుంటారు. ఇక మన ఇళ్ళల్లో ఎవరైనా చనిపోయిన తర్వాత కల్లోకి వస్తుంటారని చాలామంది చెప్పగా వింటున్నాం. అది మనకు అనుభవం అవుతూ ఉంటుంది. అయితే అలా చెనిపోయిన వాళ్ళు కల్లోకి వస్తే ఏమవుతుంది…? అనే లైన్ మీద ఇంగ్లీష్ లో ఓ ఆర్టికల్ వచ్చింది. అది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మనకు బాగా దగ్గరైన వారు కానీ తెలిసిన వారు చనిపోయి మనకు కలలో కనిపిస్తున్నట్లయితే మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని, జాగ్రత్తగా ఉండమని ఆ కలలు హెచ్చరిస్తున్నట్టు సంకేతమట. అయితే మనం కనే ప్రతి కల, మన నిజజీవితానికి, మన ఊహలకు దగ్గరగా రాదు, ఉండదు కూడా. ఆ కలలు నిజజీవితంలోకి జరుగుతాయా? లేదా? అంటే చెప్పడం కష్టం. అయితే చనిపోయిన వ్యక్తులు మన కలలో కనిపిస్తే, వారు మనతో మాట్లాడితే భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఓ సారి తెలుసుకుందాం. ఇందులో ఎంత నిజం ఉందొ తెలియదు గానీ తెలుసుకుంటే నష్టం లేదుగా ..

1/7 Pages

చనిపోయిన నాన్న కల్లోకి వస్తే..

చనిపోయిన నాన్న కలలో కనిపించి మీతో మాట్లాడితే, మీరు కొన్ని దుష్టశక్తుల నుండి అపకీర్తిని ఎదుర్కుంటారు.ఏవైనా కోల్పోయే అవకాశం ఉంద ని అర్ధమట. అలాగే మీ శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండమని సంకేతాలను ఇస్తుందట. ఆడ - మగవారు కూడా ఈ విషయంలో తమ సామాజిక కీర్తి గురించి జాగ్రత్తపడాలట.

English summary

Strangest Facts About Your Dreams. Dream of dead people as a sign of unhappy. You want to know more then read this article...