ఆ కోరిక తీర్చమంటూ వాష్ రూమ్ లో టీచర్ కి టార్చర్

Student Harassed A Teacher In School In Delhi

10:59 AM ON 21st January, 2017 By Mirchi Vilas

Student Harassed A Teacher In School In Delhi

కామంతో కళ్ళు మూసుకుపోతే వావివరుసలు కళ్ళకు కనిపించవు. గౌరవభావం, సోదరభావం కనుమరుగైపోతున్న రోజులివి. రోజురోజుకీ ఇలాంటి దారుణాలు ఎన్నో వినాల్సి వస్తోందని అందరూ అనేమాట. తాజాగా చోటుచేసుకున్న ఓ దారుణం సభ్యసమాజం తలదించుకునేలా వుంది. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం... షహదారా జిల్లాలోని వివేక్ విహార్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 44 ఏళ్ళ టీచర్ పని చేస్తున్నారు. ఆమె మధ్యాహ్నం సమయంలో వాష్ రూమ్ లోకి వెళ్ళడాన్ని ఓ విద్యార్థి గమనించాడు. వెంటనే బయట ఘడియ పెట్టేశాడు. తలుపు తీయకుండా 15 నిమిషాలపాటు ఆమెను మాటలతో హింసించాడు. తలుపు తీయాలంటే తనతో సెక్స్ చేయాలని డిమాండ్ చేశాడు. ఆ బాలుడిని ఆమె గుర్తు పట్టలేకపోయినా, వాష్ రూమ్ వెంటిలేటర్ నుంచి కాస్త ఆనవాలు పట్టగలిగింది. ఆ బాలుడికి ఎంత నచ్చచెప్పినా వినకపోగా, తిరిగి ఆమెనే ఆ బాలుడు దూషించడం ప్రారంభించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈలోగా కొందరు అక్కడికి వచ్చి తలుపు తీశారు. వివేక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ సంఘటనపై స్కూలు మేనేజ్ మెంట్ కమిటీ ఓ సమావేశం నిర్వహించింది. టీచర్ కు అండగా ఉంటామని తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. విద్యార్థులకు యవ్వనం, కౌమార దశ గురించి అవగాహన కల్పిస్తామని ఎడ్యుకేషన్ మినిస్టర్ సలహాదారు అతిషి మర్లీనా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: అవార్డు కొనుకున్నాడట : సీనియర్ స్టార్ షాకింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి: అమెరికాకు హిందూ అధ్యక్షుడా... ఒబామా షాకింగ్ కామెంట్స్

English summary

A student in Delhi was harassed a school teacher by locking up the bathroom door and asking her to do sex with him. When she was in bathroom she shouted loudly then the student ran away from that place and later school administrators gave police complaint on this incident and police were checking CC Camera footage.