తనకంటే బాగా చదువుతున్నాడని చంపేసాడు 

Student Murdered By Another Student In Visakha District

11:54 AM ON 21st May, 2016 By Mirchi Vilas

Student Murdered By Another Student In Visakha District

ఇదో దారుణమైన ఘటన . చదువుల్లో ఒక మంచి విద్యార్దిగా రాణించాలంటే విద్యార్థుల్లో పోటీతత్వం ఉండాలి. ఒక విద్యార్ది బాగా చదువుతుంటే ఇంకో విధ్యార్ది అతని కంటే బాగా చదువుకోవాలి , అంతే కానీ ఒకరు బాగా చదువుతున్నారన్న ఈర్ష్య తో ఏకంగా తన తోటి విద్యార్దిని చంపేసాడు ఒక బాలుడు . ఇంతటి దారుణ ఘటన జరిగింది మరెక్కడో కాదు సాగర తీరం విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. ఐదు నెలల తరువాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .

ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.....విశాఖ జిల్లాలోని చోడవరం మండలం లక్ష్మీపురానికి చెందిన తాళపుశెట్టి కోదండరాముడు అనే బాలుడు స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు ఆటపాటలలో కూడా కోదండరాముడు ముందుండేవాడు . కోదండరాముడు ముందుండటం అందరు ప్రశంసిస్తుండడంతో అదే గ్రామానికి చెందిన సహా విద్యార్ది , గ్రామంలో ఒక నాయకుడి కొడుకు తట్టుకోలేకపోయాడు . పాఠశాలలో ఆధిపత్యం చెలాయించాలని భావించిన ఆ నాయకుని కొడుకు తనకు కోదండరాముడు అడ్డంగా ఉన్నాడని భావించాడు.

ఇవి కూడా చదవండి:'బ్రహ్మోత్సవం' లో మహేష్ మైండ్ బ్లోయింగ్ డాన్స్(వీడియో)

కోదండరాముడిని ఎలా అయిన తనకు అడ్డుతొలగించుకోవాలని భావించ అతడు , కోదండరాముడిని తన వెంట తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపేసాడు . ఆ తరువాత కోందండరాముడి మృతదేహాన్ని దగ్గరలోని ముళ్ళపొదల్లో పడేసి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చాడు. కోదండరాముడి తల్లిదండ్రులు గాలింపు చర్యల్లో మృతదేహాన్ని ముళ్ళపొదల్లో గుర్తించారు. పాము కరవడం వల్ల చనిపోయి ఉంటాడని భావించారు.

అయితే, పోస్టుమార్టం రిపోర్టులో కోదండరాముని శరీరంపై బలమైన గాయాలున్నట్టు తేలడంతో కోదండ రాముడి తండ్రి శంకరరావు ఫిర్యాదు మేరకు అతని సహ విద్యార్థిని ప్రశ్నించగా, అతడు నేరాన్ని అంగీకరించాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు మైనర్‌ కావడంతో అతని వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.

ఇవి కూడా చదవండి:అమ్మాయి ఫోన్ దొరికిందని ఏం చేసాడో తెలుసా(వీడియో)

ఇవి కూడా చదవండి:ప్రియురాలికి రీఛార్జి చేయించాడని భార్య ఆత్మహత్య

English summary

A Tenth Class Student in Vishaka District was killed his co-student Named Kodanda Ramudu for studying well and active in sports. Police sucessfully chased this murder mystery and taken the Accused person into their custody.