టీచర్ చెంప చెల్లుమనిపించాడు.. ఆపై...

Student slaps teacher in Chennai

11:25 AM ON 27th August, 2016 By Mirchi Vilas

Student slaps teacher in Chennai

పూర్వం విద్యార్థులను టీచర్స్ దండించేవారు. కానీ కాలం తీరు మారింది. విద్యార్థులు తిరగబడుతున్నారు. టీచర్స్ ని కొడుతున్నారు. తాజాగా తిరుప్పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థి ఏకంగా, మహిళా లెక్చరర్ చెంప చెళ్లుమనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. వీరపాండి గ్రామం పాఠశాలలో సుశీల అనే గణిత అధ్యాపకురాలు ప్లస్ టూ విద్యార్థులకు బోధిస్తున్నారు. గురువారం విద్యార్థి సూర్యప్రకాష్ తన నోటు పుస్తకాలను తీసుకురావడం మరచిపోయాడు. దీనిని గుర్తించిన అధ్యాపకురాలు అతనిని మందలించింది.

వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కోపోద్రేకానికి గురైన సూర్యప్రకాష్ అధ్యాపకురాలి చెంప చెళ్లుమనిపించాడు. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు ఉమ వెంటనే స్పందిస్తూ, సదరు విద్యార్థి సూర్య ప్రకాష్ ని మందలించడంతోపాటు, తల్లిదండ్రులను పిలిపించి చర్చించిన అనంతరం విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించేశారు.

ఇది కూడా చదవండి: ప్రిన్స్ కోసం ఆ స్టార్ హీరోకి నో చెప్పేసింది...

ఇది కూడా చదవండి: 'టాప్' లేపేసిన చరణ్ హీరోయిన్(ఫోటో)

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు తెలియకుండా పైలట్స్ రహస్యంగా ఉంచే సీక్రెట్స్ ఇవే!

English summary

Student slaps teacher in Chennai. A student slaps teacher in front of all students in Chennai plus two college.