ఫేస్‌బుక్లో గన్లు అమ్ముతూ దొరికేశారు

Students caught selling guns on Facebook

04:40 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Students caught selling guns on Facebook

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌. పాత స్నేహితులకు... బంధువులకు.. టచ్ లో ఉండటానికి ఎక్కువగా ఉపకరిస్తున్న ఈ ఫేస్ బుక్ ను కొందరు అడ్డదారులు.. అక్రమ సంపాదన కోసం వినియోగిస్తున్నారు. ఫేస్ బుక్ ద్వారా అక్రమంగా ఆయుధాలు అమ్ముతున్న ఘటన థాయ్ లాండ్ లో జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరు విద్యార్థులను థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో అరెస్టు చేశారు. ఓ యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ ఫేస్‌బుక్‌ ద్వారా గన్లు, బుల్లెట్లు విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో వారిద్దరినీ బ్యాంకాక్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను నాంగ్‌చాక్ జిల్లా క్రతుంరాయ్ ప్రాంతానికి చెందిన డామ్రోంగ్ ఓన్‌ర్యున్ (21), పిచ్చాన్ (21) గా గుర్తించారు. వారి నుంచి హ్యాండ్ గన్లు, 200 రౌండ్ల 0.38, 9ఎంఎం బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మూడు నెలలుగా ఫేస్‌బుక్ ద్వారా బులెట్లు, ఆయుధాలను విక్రయిస్తున్నట్లు డామ్రోంగ్ పోలీసుల విచారణ అంగీకరించాడు.

English summary

Two university students have been arrested in Bangkok for allegedly selling weapons online, following a complaint that firearms were being sold on Facebook.