టెర్రాస్ పై ఆ పని చేస్తుంటే టీచర్ వీడియో తీసింది

Students kissing on terrace

11:29 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Students kissing on terrace

ఒకరికి సరదా, మరొకరికి చెలగాటం, ఇంకొందరికి కాసులు కురిపించే బ్లాక్ మెయిలింగ్ సాధనం... ఒకే ఇన్సిడెంట్ కానీ రూపాలు ఎన్నో, ఇంతకీ ఈ ఉపాద్ఘాతమ్ ఎందుకంటే, ఓ స్కూల్లో జరిగిన ఘటన పక్క స్కూళ్ళు వాళ్ళు ఎలా ప్రోపకండా చేయాలని చూసారో అందుకు ఇది తార్కాణం. ముఖ్యంగా సొంత లాభం కోసం విద్యార్ధుల జీవితాన్ని ఫణంగా పెట్టేందుకు కార్పోరేట్ స్కూళ్లు ఎంత మాత్రం ఆలోచించడం లేదనడానికి ఇదో మచ్చు తునక. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి పోలీసుల కధనం ప్రకారం, 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు స్కూల్ టెర్రాస్‌పై సన్నిహితంగా ఉండటాన్ని పక్కనే ఉన్న మరో స్కూల్ మహిళా టీచర్ చూసి, ఊరుకోకుండా ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసేసింది.

ఇది కూడా చదవండి: కెమెరాకు చిక్కిన మత్స్య కన్య

ఆ తర్వాత దానిని ప్రిన్సిపాల్‌కు చూపించింది. దీంతో తమకు పోటీగా ఉన్న పక్క స్కూల్‌కు చెడ్డపేరు తేవాలన్న ఆలోచనతో ప్రిన్సిపాల్ ఈ వీడియో వాట్సప్‌లో తన మిత్రులు, సన్నిహితులకు షేర్ చేసేశాడు. ఇంకేముంది ఈ వీడియో వాట్సప్‌లో హల్ చల్ చేసి.. చివరకు ఆ ఏరియాకు చెందిన మీడియా రిపోర్టర్లకు చేరింది. ఇంకేముంది, మరో మలుపు తిరిగింది. మీ స్కూలుకు చెందిన విద్యార్ధుల బాగోతాన్ని బయటకు రాకుండా కప్పిపుచ్చడానికి తమకు డబ్బు ఇవ్వాలని వీడియో పాఠశాల యాజమాన్యానికి చూపించి వారిని బెధిరించారు. ఈ విషయం చివరకు బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: షార్ట్స్ తోకాలేజీకి అమ్మాయిలు

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను ముద్దు పెట్టుకున్న బాలుడుతో పాటు వీడియో తీసిన టీచర్, దానిని వాట్సప్‌లో షేర్ చేసిన ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు పాఠశాల యాజమ్యాన్ని బెధిరించిన మీడియా రిపోర్టర్లపైనా దర్యాప్తు చేపట్టారు. పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలే గానీ, అది అనారోగ్యానికి దారితీస్తే, ఇదిగో ఇలానే ఉంటుంది.

ఇది కూడా చదవండి: సర్దార్ సినిమా కోసం కత్తులతో దాడి.. ఒకరి మృతి

English summary

Students kissing on terrace. Hyderabad Balanagar school students kissing on terrace and teacher is taking video them.