హైదరాబాద్ లో స్టూడియో ఎఫ్‌-45 ప్రారంభం

Studio F-45 in Hyderabad

09:51 AM ON 24th May, 2016 By Mirchi Vilas

Studio F-45 in Hyderabad

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్‌ సెంటర్‌ స్టూడియో ఎఫ్‌-45 నగరంలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ ఫిట్‌నెస్‌ స్టూడియోను ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్‌లీ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా పాల్గొన్నాడు. ఈ ఎఫ్‌-45ను భారత్‌లో మొట్టమొదటిసారి ప్రారంభించడం విశేషం. ఈ ఎఫ్‌-45కు భారత్‌ తరఫున బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న బ్రెట్‌లీ.. ప్రముఖ ఫిట్‌నెస్‌ సెంటర్‌ను ప్రపంచంలోకెల్లా అత్యంత వినూత్నమైన ట్రైనింగ్‌ సెంటర్‌గా అభివర్ణించాడు. వచ్చే ఐదేళ్లలో 300 పైచిలుకు బ్రాంచ్‌లను నెలకొల్పడమే లక్ష్యమని ట్రైనర్‌, ఎఫ్‌-45 ఇండియా డైరెక్టర్‌ ప్రదీప్‌ పల్లి తెలిపారు.

English summary

Studio F-45 in Hyderabad