ఆన్‌లైన్‌లో నేతాజీ అంత్యక్రియల ఫైల్స్

Subash Chandrabose Cremation Details Released By Britain Website

10:46 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Subash Chandrabose Cremation Details Released By Britain Website

విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ పౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ అంత్యక్రియలకు సంబంధించిన పత్రాలను బ్రిటన్‌ వెబ్‌సైట్‌ విడుదల చేసింది. బోస్‌ అంత్యక్రియలకు తాను ఏర్పాట్లు చేసినట్లు తైవాన్‌ అధికారి చెప్పిన సాక్ష్యాధారాలను వెలుగులోకి తీసుకొచ్చింది. నేతాజీ చివరి రోజుల గురించి తెలియచేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. 1945 ఆగస్టు 18న తైపేలోని వైమానిక క్షేత్రం శివార్లలో విమానం కూలిపోయిన ఘటనలో బోస్ మరణించినట్లు నిర్ధారించే సాక్ష్యాధారాలను బ్రిటన్‌ విదేశాంగ కార్యాలయం ఫైల్‌ నెంబర్‌ ఎఫ్‌సి1852/6, 1956లో చూడవచ్చు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బోస్‌ఫైల్స్‌.ఇన్ఫో విడుదల చేసిన కొన్ని డాక్యుమెంట్లలో ఈ సాక్ష్యాధారాలు కూడా వున్నాయి. తైపేలో అంత్యక్రియలకు అనుమతించే ఇన్‌ఛార్జి తాన్‌ తి-తి స్థానిక అధికారులతో కలిసి సుభాష్‌ చంద్ర బోస్‌ అంత్యక్రియలు నిర్వహించడానికి సంబంధించిన వివాదాలకు చెక్‌ పెట్టారని వెబ్‌సైట్‌ పేర్కొంది. అసలు విమాన ప్రమాదం నిజమా కాదా అనేది తేల్చలేక దశాబ్దాల తరబడి వివాదం నెలకొంది. రెండు భారత ప్రభుత్వాలు దర్యాప్తులు నిర్వహించినా ఫలితం లేకపోయింది. బ్రిటన్‌ విదేశాంగ కార్యాలయానికి పంపిన తైవాన్‌ పోలీసు నివేదికలో ఆ సాక్ష్యాధారాలు వున్నాయి. దాన్ని 1956 జులైలో బ్రిటీష్‌ హై కమిషన్‌ కార్యాలయం ఢిల్లీకి పంపింది.

English summary

An British website released the cremation details of Netaji Subash Chandrabose and the reasons behind his death.It says that he was died in Aeroplane accident, that site aslo shows that the proofs about his death