రియల్ హీరో డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి

Subramanya Swamy The Real Hero

07:12 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Subramanya Swamy The Real Hero

ఎవరీ సుబ్రహ్మణ్య స్వామి .... రియల్ హీరో ఏంటి అనుకుంటున్నారా ? అదేనండీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా అండ్ కో ని కోర్టు మెట్లు ఎక్కించిన డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి .... 10 ఏళ్ళపాటు దేశాన్ని నడిపించిన సోనియాను కోర్టు కీడ్చడం ఒక్కటే కాదు , తమిళనాట పురుచ్చి తలైవి గా కీర్తించబడే సిఎమ్ జయలలితని కోర్టు మెట్లు ఎక్కించి , జైలుకి పంపిన ఘనుడు ఈయన... అందుకే ఈవేళ సోషల్ మీడియా లో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ని హీరోగా అభివర్ణిస్తూ , ఎంతోమంది ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో పోస్టులు పెట్టారు.

ఇంతకీ ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకోవాలంటే, తమిళనాడు లో 1939 సెప్టెంబర్ లో పుట్టిన ఈయన రాజకీయాల్లో ఆరితేరిన దిగ్గజం. చెన్నై దగ్గర మైలాపూరు కి చెందిన ఈయన ఆర్ధిక నిపుణుడు, మేధావి. మంచి వక్త. ప్రొఫెసర్. డాక్టర్ స్వామి కేంద్ర కేబినేట్ లో పనిచేసారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నెలకొల్పిన జనతా పార్టీకి చాలాకాలం అధ్యక్షులుగా వ్యవహరిస్తూ. వన్ మేన్ ఆర్మిగా రాణించారు. 2003 ఆగస్టు 11న బిజెపిలో చేరారు. జనతాపార్టీ అధ్యక్షునిగా ఉండగానే సోనియా గాంధిపై యుపి ఎ ప్రభుత్వ హయాంలో కేసు వేసారు. 1994 లో ఆనాటి ప్రధాని లేబర్ స్టాండర్డ్స్ అండ్ ఇంటర్ నేషనల్ ట్రేడ్ కమీషన్ చైర్మన్ (కేబినేట్ రాంక్) గా ఈయనను నియమించారు.

డిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజి నుంచి మేధ మెటిక్స్ లో డిగ్రీ చేసిన డాక్టర్ స్వామి కోల్ కత్తా లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాటస్టిక్స్ నుంచి స్టాటస్టిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేసారు. 1965 లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో పిహెచ్ డి చేసారు. డిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రొఫెసర్ గా చేరారు. 1969 నుంచి 1991 వరకు ఎకనామిక్స్ ,మేధ మెటిక్స్ ప్రొఫెసర్ గా చేసారు.

రాజకీయాల్లో జన సంఘ్ పూర్వాశ్రమం గల డాక్టర్ స్వామి 1974 నుంచి 1991 వరకు 5 సార్లు పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించారు. 1974 లో ఉత్తర ప్రదేశ్ నుంచి జనసంఘ్ టికెట్ పై రాజ్యసభలో అడుగుపెట్టిన డాక్టర్ స్వామి 1977 లో ముంబై నార్త్ నుంచి జనతా పార్టీ తరపున లోకసభకు ఎన్నికయ్యారు. 1980 లో కూడా జనతా అభ్యర్ధిగా ముంబై ఈస్ట్ నుంచి ప్రాతినిద్యం వహించారు.

డాక్టర్ స్వామి 1988 లో ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999 లో తమిళనాడు మదురై నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 1990 లో ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా నియమితులైన ఈయన ఏడాది పాటు సేవలందించారు. చంద్ర శేఖర్ ప్రధానిగా వుండగా న్యాయ , వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేసారు. 2013 లో ప్రస్తుత కేంద్ర హొమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆహ్వానం మేరకు బిజెపిలో చేరిన డాక్టర్ స్వామి జనతాపార్టీని విలీనం చేసారు.

జయలలిత పై కేసు , రామకృష్ణ హెగ్డే ఫోన్ టాపింగ్ , 2 జి స్కాం ... ఇలా ఎన్నో కేసులను బయట పెట్టిన డాక్టర్ స్వామి యుపి ఎ హయాంలో సోనియా పై నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై వేసిన కేసు ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఎప్పుడూ వార్తాల్లో ఉంటూ ప్రత్యర్ధులకు గుబులు పుట్టించే డాక్టర్ స్వామి నేషనల్ హెరాల్డ్ కేసుతో మరింత గా వార్తల్లో నిలిచారు. మరి ఈకేసులో ఎంతవరకు నెగ్గుకొస్తారొ చూడాలి.

English summary

Subramanian Swamy (born 15 September 1939) is an Indian politician from the state of Tamil Nadu. He is also an economist and a former cabinet minister..He was the President of the Janata Party.He merged his party on 11 August 2013 with Bharatiya Janata Party (BJP)