సుబ్రతా రాయ్ పెరోల్ పొడిగింపు.. డిపాజిట్ 200 కోట్లు..

Subrata Roy petition was increased

05:13 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Subrata Roy petition was increased

బడా బాబులు కోటాను కోట్ల రూపాయలు ఎగవేస్తారు. జనం దగ్గర దోచుకుని నెత్తిన టోపీ పెట్టేస్తారు. వారి దగ్గర నుంచి డబ్బు రాబట్టడం అంత సులువూ కాదు. చివరకు కోర్టు డిపాజిట్ అంటే మాత్రం కట్టేస్తారు. ఇక సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ మధ్యంతర పెరోల్ ను సుప్రీం కోర్టు మరోసారి పొడిగించింది. అక్టోబర్ 24 నాటికి మరో రూ. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో తిరిగి జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించింది. వినియోగదారుల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన సహారా గ్రూప్ సంస్థలను రూ.17,600 కోట్లు 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని 2012 ఆగస్ట్ 31న సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ తీర్పును పాటించనందుకు 2014 మార్చి 4న సుబ్రతా రాయ్ తో పాటు ఆయన అల్లుడు అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబేలకు జ్యూడిషియల్ కస్టడీ విధించి తీహార్ జైలుకు పంపింది. ఈ ఏడాది మే నెలలో సుబ్రతా రాయ్ తల్లి చనిపోవడంతో ఈ ముగ్గురిని పెరోల్ పై విడుదల చేసింది. అనంతరం రెండు సార్లు వారి పెరోల్ పొడిగించి రూ.300 కోట్ల డిపాజిట్ ను సుప్రీం కోర్టు రాబట్టింది.

ఇది కూడా చదవండి: దారుణం: భార్య ఉన్న గదికి తాళం వేసి.. పక్క గదిలో ఉన్న కూతుర్ని..

ఇది కూడా చదవండి: సాఫ్ట్ వేర్ కంపెనీల్లో లైంగిక వేధింపులు.. ఎక్కువగా ఈ కంపెనీలేనట!

ఇది కూడా చదవండి: టీవీలో రేప్ వార్తలు చూసి అక్కడ తాళం వేసుకుంది.. ఆపై ఏం జరిగిందో తెలిస్తే షాకౌతారు!

English summary

Subrata Roy petition was increased. Subrata Roy petition was increased. And he had to deposit 200 crores for supreme court.