జైలు విలాసాలకు 1.23కోట్లా

Subrata Roy Spends Rs 1.23 Crore For Special Facilities In Tihar Jail

12:18 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Subrata Roy Spends Rs 1.23 Crore For Special Facilities In Tihar Jail

దేశంలో డబ్బుంటే జైలులో ఉన్నా, బయట ఉన్నా ఒక్కటే. ఎలాంటి విలాసాలైనా, వినోదాలైనా డబ్బుంటే జైలులో కూడా అందిస్తారన్నది చేదు నిజం. ఖైదీలందు విఐపి ఖైదీలు కూడా వేరుగా ఉంటారన్నటి జగమెరిగిన సత్యం. సహారా స్కాంలో దేశవ్యాప్తంగా జనం యొక్క డబ్బును కొల్లగొట్టి జైలు ఊచలు లెక్కపెడుతున్న సహారా వ్యవస్థాపకుడు సుబ్రతో రాయ్‌ తన జైలు సదుపాయల కోసం ఖర్చుపెట్టిన మొత్తం అక్షరాల ఒక కోటి ఇరవైమూడులక్షల రూపాయలట. గత ఏడాది మార్చిలో తీహార్‌ జైలులో జైలు జీవితం ప్రారంభించిన సుబ్రతోరాయ్‌ ఇప్పటివరకూ ఇంత పెద్ద మొత్తాన్ని విఐపి సదుపాయాలను పొందేందుకు వెచ్చించడాట. ఈ మొత్తంతో ఏకంగా 200మంది ఖైదీలను ఏడాది పాటు పోషించవచ్చని జైలువర్గాలు తెలుపుతున్నాయి.

సహారసంస్థ అక్రమ డిపాజిట్లకు సంబంధించిన కేసులో బెయిల్‌ నిమిత్తం 10వేలకోట్ల రూపాయలను డిపాజిట్‌గా కట్టడంలో విఫలమైన సుబ్రతోరాయ్‌ను గడిచిన మార్చి నెలలో తీహార్‌జైలుకు పంపారు. అత్యంత భద్రత కలిగిన విఐపి వార్డులో ఉంచబడిన సుబ్రతోరాయ్‌కు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని కూడా కల్పించింది.

ఈ సదుపాయంతో తమ సంస్థకు న్యూయార్క్‌లో ఉన్న ఫైవ్‌స్టార్‌ హోటళ్ళను అమ్ముకునేందుకు కోర్టు వీలు కల్పించింది. ఈ సదుపాయాలను జైలు ద్వారా పొందినందుకు గాను ఇప్పటికే సహారా సంస్థ తీహార్‌ జైలుకు 1,23,70,000 రూపాయలను చెల్లించింది. ఎయిర్‌కండిషన్‌ కలిగిన ఈ కాన్ఫరెన్స్‌ రూమ్‌లో ప్రపంచంలోని ఎవరితోనైనా మాట్లాడే విధంగా సమాచార వ్యవస్థను పొందుపరిచారు. సుబ్రతో రాయ్‌ వాడుకునేందుకు వీలుగా రెండు లాప్‌టాప్‌లు, రెండు డెస్క్‌టాప్‌లను, లాండ్‌లైన్‌ ఫోన్లను, రాయ్‌కు సహకారం అందించేందుకు ఒక వ్యక్తిగత సహాయకుడిని కూడా అందుబాటులో ఉంచారు. అంటే జైలులో ఉన్నప్పటికీ ఒక కార్పొరేట్‌ అధిపతి పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలను సాగించేందుకు వీలుంటుందన్న మాట.

అయితే కోర్టు తాజాగా వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రత్యేక సదుపాయాలన్నింటినీ గత నవంబర్‌ నెలలో నిలిపివేసారు. కోర్టు ఇచ్చిన గడువులోగా సహారా కంపెనీ తమ ఆస్తులను అమ్ముకోవడంలో విఫలం అయిన కారణంగానే సుబ్రతోరాయ్‌కు బెయిల్‌ వచ్చే అన్ని అవకాశాలు దాదాపు మూసుకోపోయాయి.


English summary

Sahara Group founder Subrata Roy has spend Rs 1.23 crore to Tihar Jail authorities for all the special facilities. He enjoyed for the past one year in a special cell